వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్టు: నారా లోకేష్‌తో బాలయ్యకు కౌంటర్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: వియ్యంకుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ దూకుడుకు కళ్లెం వేసే కొత్త ఎత్తులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో ప్రధానమైన పదవి ఇచ్చి, ఆయనకు చురుకైన పాత్ర ఇస్తే మొదటికే మోసం వస్తుందని చంద్రబాబు అనుకుంటున్నట్లు మీడియా వార్తలు వచ్చాయి. బాలయ్యకు తన కుమారుడు నారా లోకేష్‌ను అడ్డం పెట్టాలని ఆయన ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

బాలయ్యకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తూనే నారా లోకేష్‌ను ముందుకు దించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. తనకు అల్లుడు కావడంతో నారా లోకేష్‌ను వ్యతిరేకించడానికి బాలకృష్ణ వెనకాడుతారని, దాంతో లోకేష్‌ను క్రియాశీలక రాజకీయాల్లోకి తేవడానికి ఏ విధమైన ఆటంకం ఉండదని చంద్రాబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

నిజానికి, ఇప్పటికే లోకేష్ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో చేయి పెట్టినట్లు చెబుతున్నారు. నగదు బదిలీ పథకం రూపకర్త నారా లోకేష్ అనే ప్రచారం ఇప్పటికే ముమ్మరంగా సాగింది. తన కుమారుడి తెలివితేటలను, వ్యూహాలను ప్రజల ముందు పెట్టి తగిన ప్రాధాన్యం లభించేలా చూడాలని చంద్రబాబు అనుకుంటున్నారట.

నారా లోకేష్ ఆరంగేట్రానికి అడ్డంగా ఉన్న నందమూరి హరికృష్ణను, జూనియర్ ఎన్టీఆర్‌ను ఇప్పటికే దూరం పెట్టినట్లు, బాలయ్య ద్వారా ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా చంద్రబాబు నిర్వహించినట్లు చెబుతున్నారు. బాలకృష్ణ పార్టీ బాధ్యతలు చేపట్టి జిల్లాల్లో విరివిగా పర్యటించే ఆలోచనలో ఉన్నారు. బాలయ్య పర్యటనలు చేస్తే అధికార కేంద్రం మారవచ్చు లేదా రెండో అధికార కేంద్రం ఏర్పడవచ్చు.

అది జరగకుండా ఉండాలంటే తన కుమారుడు లోకేష్‌ను అడ్డం పెట్టడమే మంచిదని, అందుకు నారా లోకేష్‌కు పార్టీ పదవి ఇస్తే సరిపోతుందని, దాంతో బాలయ్యకు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఉంటే బాగుండదని చెప్పి ఎగనామం పెట్టవచ్చునని చంద్రబాబు భావిస్తున్నట్లు బుధవారం మీడియాలో వార్తలు వచ్చాయి. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. అంతా చంద్రబాబు ఆలోచన ప్రకారమే జరుగుతుంది. ఇందులో కాదనేవారు కూడా ఎవరూ లేరు.

English summary
According to media reports - Telugudesam party president N Chandrababu Naidu has planned to make son Nara Lokesh political entry to counter hero Balakrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X