బొత్స ఫ్లైట్ ఎక్కారు, లిస్టు ప్రకటించారు

Botsa Satyanarayana
ఉప ఎన్నికల పార్టీ అభ్యర్థుల జాబితాతో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీకి విమానం ఎక్కారో లేదో, ఎఐసిసి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. దీంతో రాష్ట్ర నాయకత్వంపై నమ్మకం లేకపోవడంతో తనంత తానే జాబితాను తయారు చేసి, ప్రకటించిందా అనే అనుమానాలు తలెత్తాయి. దీంతో అయోమయం, గందరగోళం చోటు చేసుకుంది. మీడియా హడావిడి పడింది. తాను కేరళ పర్యచటనకు వెళ్లాల్సి ఉండడంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆజాద్ జాబితాను తక్షణమే ఫాక్స్‌లో పంపాలని బొత్సను కోరారు. జాబితాను ఆజాద్‌కు ఫాక్స్ చేసి, బొత్స ఢిల్లీకి బయలుదేరారు.

తన వద్దకు వచ్చిన జాబితాను ఆజాద్ ఆమోదించి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. ఆమె కూడా ఈ జాబితా వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా ఆమోద ముద్ర వేశారు. ఆమె నుంచి జాబితా బయటకు వచ్చిన వెంటనే ఏఐసీసీ వర్గాలు జాబితాను ప్రకటించాయి. ఈ విషయాన్ని తక్షణమే బొత్సకు ఆజాద్ వివరించారు. ఈ విషయం తెలియక రాజకీయంగా ఆ సంఘటనపై ఊహాగానాలు చెలరేగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+