బాలకృష్ణకు దగ్గరవుతున్న హీరో రాజశేఖర్?

ఇప్పుడు బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ సింహంలా గర్జిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణ హవా నడిచే పరిస్థితులున్నాయి. ఈ విషయం గ్రహించిన రాజశేఖర్ బాలకృష్ణకు దగ్గరవుతున్నట్లు చెబుతున్నారు. చిరంజీవిని రాజకీయంగా ఎదుర్కోవడానికి బాలకృష్ణ సిద్ధపడడం ఆయన మనసుకు బాగా నచ్చిందట. దీంతో ఆయన బాలకృష్ణతో స్నేహం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. శనివారం హైదరాబాదులో జరిగిన క్యాన్సర్ అవేర్‌నెస్ వాక్‌లో రాజశేఖర్ బాలకృష్ణ అడుగులో అడుగులు వేశారు. మిగతా నటులు చాలా మంది ఇందులో పాల్గొన్నప్పటికీ రాజశేఖర్ పాల్గొనడం ప్రత్యేకమైందేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications