ప్రణబ్ దాదాకు ప్రమోషన్: కేబినెట్‌లోకి చిరంజీవి

మరికొన్ని పార్టీలు కూడా ఆయనకు మద్దతివ్వనున్నాయి. ఇందుకోసం ప్రణబ్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో ఆయన హైదరాబాదు వచ్చి పలు పార్టీల మద్దతు కోరనున్నారు. ప్రణబ్‌కు ప్రత్యర్థిగా పిఏ సంగ్మా పోటీ చేస్తున్నప్పటికీ ఆయనకు గెలుపు అవకాశాలు లేవు. విషయానికి వస్తే రాష్ట్రపతి ఎన్నికల అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెసు పార్టీ నేతలే చెబుతున్నారు.
అదే సమయంలో కేంద్రమంత్రి వర్గంలోనూ కొన్ని చేర్పులు మార్పులు జరుగవచ్చునని చెబుతున్నారు. ప్రణబ్ దాదా రాజీనామా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ హెచ్చరికలు నేపథ్యంలో మన్మోహన్ కేబినెట్‌లో స్వల్పంగానైనా మార్పులు జరిగే అవకాశముందని అంటున్నారు. అప్పుడు మన రాష్ట్రం నుండి చిరంజీవికి అవకాశం దక్కవచ్చునని చెబుతున్నారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినప్పుడే ఆయనకు అధిష్టానం నుండి కేంద్రమంత్రి పదవిపై హామీ లభించిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. విలీనం జరిగి నెలలు గడుస్తున్నా.. ఇదిగో పదవి వస్తుంది.. అదిగో పదవి వస్తుంది.. అనే వాదనలు మినహా చిరంజీవికి కేంద్రమంత్రి పదవి మాత్రం ఇప్పటి వరకు రాలేదు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత జరిగే చేర్పులలో మాత్రం ఖచ్చితంగా చిరంజీవికి అవకాశం దక్కుతుందని చెబుతున్నారు.
ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో రెండు మంత్రి పదవులు చిరంజీవి వర్గానికి కట్టబెట్టారు. చిరంజీవిని కేంద్రమంత్రిని చేసేందుకే తిరుపతి ఎమ్మెల్యేగా రాజీనామా చేయించి.. రాజ్యసభకు పంపారనేది బహిరంగ రహస్యం. ఆయన రాజ్యసభ్యుడిగా అయినప్పటి నుండి పదవిపై ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. అయితే చిరంజీవి మంత్రి పదవిపై ఉప ఎన్నికల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని మరికొందరు అంటున్నారు.












Click it and Unblock the Notifications