వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్ మీడియాపై కత్తిన కట్టిన టిడిపి?

జగన్ పత్రికలోను, చానల్‌లోను ఉప ఎన్నికలకు అనుకూలంగా వస్తున్న వార్తలను, చర్చలను పెయిడ్ ఆర్టికల్స్‌గా పరిగ ణించాలని టీడీపీ నేత పెద్దిరెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కడప పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా టీవీలో వైఎస్ఆర్ పార్టీ గుర్తును చూపడం, తనకు అనుకూలమైన వారిని చర్చల్లో కూర్చోబెట్టి గెలుపు ఏకపక్షమని మాట్లాడించడం చేశారని ఈసీకి రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా ఇలాంటి వాటిని కట్టడి చేయాలని కోరారు.