జైల్లో ఉన్న జగన్‌కు లెటర్స్ మీద లెటర్స్

మే 27న అరెస్టైన జగన్‌కు కూడా తోటీ ఖైదీల్లాగే ఉత్తరాలు వస్తున్నాయి. ఆయనకు ఒక నెలకు దాదాపు అరవై వరకు ఉత్తరాలు వస్తున్నాయట. జగన్‌కు ఉత్తరాలు వస్తున్నాయని జైలు సూపరింటెండెంట్ తెలియజేశారు. జగన్ పార్లమెంటు సభ్యుడు కావడంతో పార్లమెంటు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతరుల నుండి ఉత్తరాలు వస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా జగన్ జైలు నుండి రాజకీయాలు నెరపుతున్నారని టిడిపి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
జైలులో ఉన్న జగన్‌కు నిబంధలకు మించి ములాకత్‌లను అనుమతిస్తున్నారని, సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నారని, ఫెసిలిటీస్ విషయంలోనూ ఇతర విఐపిల ఖైదీల కంటే భిన్నంగా ఉంటుందని.. జగన్‌కు సంబంధించిన వీడియోలను మీడియాకు విడుదల చేయాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.












Click it and Unblock the Notifications