వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు మీడియాపై గుర్రుమంటున్న అక్బర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
హైదరాబాద్: ద్వేశపూరిత ప్రసంగంతో చిక్కుల్లో పడిన మజ్లీస్ శానససభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ తెలుగు మీడియాపై గుర్రుమంటున్నారు. మీడియా వల్లనే తాను చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆయన హైకోర్టులో వేసిన పిటిషన్‌లో కూడా వక్రీకరించారు.

మతపరమైన వ్యాఖ్యలతో ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ రావడం అక్బరుద్దీన్‌కు అలవాటుగా మారిందనే విషయాన్ని కూడా మీడియా బయటపెట్టింది. అయితే, గతంలో చేసిన వ్యాఖ్యలు బయటకు రాలేదు. బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్, ప్రముఖ రచయిచ సల్మాన్ రష్దీలపై చేసిన వ్యాఖ్యలు మాత్రమే బయటకు వచ్చాయి. దానివల్ల అక్బరుద్దీన్‌కు ఎక్కువ నష్టం జరగలేదు.

కానీ, తాజా ద్వేషపూరిత ప్రసంగం వివాదంగా మారింది. ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి ఆధునిక మీడియా వల్ల బయటకు వచ్చింది. దాంతో తెలుగు మీడియాకు తగిన సమాచారం, సరుకు లభించింది. నిజానికి, అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణంగా ఉన్నాయి. దీంతో తస్లీమ నస్రీన్‌పైనో, రష్దీపైనో చేసిన వ్యాఖ్యలకు లభించిన కనీస మద్దతు కూడా అక్బరుద్దీన్‌ు ఇప్పుడు లభించడం లేదు.

అన్ని వర్గాల నుంచి మద్దతు కొరవడడంతో అక్బరుద్దీన్ ఓవైసీకి తీవ్రమైన ఇబ్బందిగా మారినట్లు కనిపిస్తోంది. దీంతో ఆయన అత్త మీది కోపం దుత్త మీది లాగా తన అక్కసునంతా తెలుగు మీడియాపై వెళ్లగక్కుతున్నారు. మీడియా తన వద్దకు రావద్దని ఆయన మంగళవారం ఉదయం అన్నారు.

English summary
Facing legal problems with hate speech delivered at Nirmal of Adilabad district, MIM MLA Akbaruddin Owaisi is expressing anguish at Telugu media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X