వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాలు, రాష్ట్రానికి గుడ్‌బై: నటి కవిత ప్రతిన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam-Kavitha
తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రానిపక్షంలో తాను ఇక ఇక్కడుండనని తెలుగుదేశం పార్టీ నేత కవిత ప్రతిబూనారు! 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, అలా జరగని పక్షంలో తాను ఇక ఇక్కడుండే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.

చంద్రబాబు అధికారంలోకి రాకుంటే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని ఆమె చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని విడిచి పెట్టి వెళ్లిపోతానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే చంద్రబాబును గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ ప్రభుత్వాల పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అందుకే ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో ఉన్నారన్నారు.

చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభించే కంటే ముందు తెలంగాణలో, సీమాంధ్రలో టిడిపి పరిస్థితి దారుణంగా కనిపించింది. దీనిపై టిడిపిలోనే నిరాసక్తత కనిపించింది. ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం సన్నగిల్లింది. అయితే, బాబు పాదయాత్ర ప్రారంభించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలంగాణ, సీమాంధ్రలో టిడిపి బాగా పుంజుకుంది. అదే సమయంలో కార్యకర్తల్లోను ఉత్సాహం కనిపిస్తోంది. దీంతో కవిత టిడిపి అధికారంలోకి ఖచ్చితంగా వస్తుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. రాకుంటే మాత్రం రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రతినబూనారు.

English summary
Telugudesam Party leader and Cine Actor Kavitha said that she will withdraw from politics if Nara Chandrababu Naidu not come in to power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X