వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు పయ్యావుల షాక్ ఇస్తారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav
హైదరాబాద్: పార్టీ తెలంగాణ వైఖరిని తప్పు పడుతూ రాయలసీమకు చెందిన శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ తన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తెలంగాణకు వ్యతిరేకంగా, సమైక్యవాదానికి మద్దతుగా తాను రెండు మూడు రోజుల్లో సంచలన నిర్ణయం తీసుకుంటానని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

సమైక్యవాదానికి మద్దతుగా ఆయన బహిరంగంగానే మాట్లాడుతున్నారు. హైదరాబాదు నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, అరవింద్ కుమార్ గౌడ్ కూడా రాష్ట్ర మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ బాటలో నడుస్తారని అంటున్నారు. సుధీష్ రాంభొట్ల ఇప్పటికే హైదరాబాదుపై పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ఈ గొంత మరింత పెరిగే అవకాశం ఉంది.

ఉత్తరాంధ్రకు చెందిన తమ్మినేని సీతారాం కూడా చంద్రబాబు వైఖరిని తప్పు పడుతున్నారు. తాను సమైక్యవాదానికే మద్దతు ఇస్తానని, రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని సహించబోనని అంటున్నారు. పయ్యావుల కేశవ్ మొదటి నుంచి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు.

పయ్యావుల కేశవ్ తమ పార్టీలో చేరుతారంటూ ఆ మధ్య వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రకటన చేశారు. దాంతో పయ్యావుల కేశవ్ కంట తడి పెట్టుకుని తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని చెప్పారు. తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులపై ఆయన దుమ్మెత్తిపోశారు.

English summary
It is said that MLA Payyavula Keshav may rebel against Telugudesam party president N Chandrababu Naidu on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X