రేణుక సర్కారు బంగ్లా రిపేర్‌కు రూ.31 లక్షలు

ఈ బంగ్లా మరమ్మతుల కోసం రూ.8 లక్షలు, అదనపు నివాస సౌకర్యాల కల్పన కోసం రూ.23 లక్షలు మొత్తం ముప్పై ఒక్క లక్ష రూపాయలను మంజూరు చేసింది. కొంతమంది అధికారులు ఈ ప్రతిపాదన వ్యతిరేకించినప్పటికీ నిధుల కేటాయింపు ఫైలు క్లియర్ చేశారట.
ఇటీవల ఈ మేరకు జివో నెంబర్ 784 ప్రభుత్వం జారీ చేసిందని కానీ, జివో జారీ అయిన రోజునే ఆ కాపీని తన వెబ్‌సైట్‌లో పెట్టకుండా రెండు మూడు రోజుల తర్వాత పెట్టిందని వార్తలు వచ్చాయి. ఈ భవనానికి ఇంత పెద్ద మొత్తం కేటాయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెబుతున్నారు.
ఈ బంగ్లను పన్నెండేళ్ల క్రితం ఇరవై లక్షల రూపాయలతో నిర్మించారని, భవనం బాగున్నప్పటికీ, ఎంపి అడగగానే ఇంత పెద్ద మొత్తం కేటాయించడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ బంగ్లాను మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కొద్ది నెలల క్రితం వరకు క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకున్నారు. దానిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వం రేణుకాకు కేటాయించారు.












Click it and Unblock the Notifications