బాబు నిక్కచ్చి: జూ. ఎన్టీఆర్ టిడిపికి దూరమే?

కోరితే తాను వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసి పెడతానని జూనియర్ ఎన్టీఆర్ రెండు, మూడు సార్లు చెప్పారు. కానీ, ఆ దిశగా చంద్రబాబు గానీ నందమూరి హీరో బాలకృష్ణ గానీ ఆలోచన చేస్తున్నట్లు కనిపించడం లేదు. జూనియర్ ఎన్టీఆర్‌ను దూరంగా ఉంచాలనే నిర్ణయానికి వారిద్దరకు కచ్చితంగా వచ్చినట్లు చెబుతున్నారు. పొమ్మనకుండా పొగపెట్టడం, రమ్మనకుండా దూరం పెట్టడం చంద్రబాబు మొదటి నుంచీ అనుసరించే వ్యూహమేనని అంటున్నారు.
తనకు గిట్టనివాళ్లపై ఏమీ మాట్లాడకుండా అవతలి వైపు అడుగు వేసేలా చూస్తారు. ఉక్కపోసి వారంతట వారు వెళ్లిపోవాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి గానీ ఆయన తండ్రి హరికృష్ణ పరిస్థితి గానీ తెలుగుదేశం పార్టీలో అలాగే ఉందని అంటున్నారు. బాలకృష్ణను చేరదీసిన చంద్రబాబు వారిద్దరిని దూరంగా పెట్టడానికే నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
గత ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసినా సీట్లు రాలేదనే అంచనాకు చంద్రబాబు వచ్చినట్లు చెబుతున్నారు. సినీ ఇమేజ్ ఎన్నికల్లో పనికి రాదని, జూనియర్ ఎన్టీఆర్ సభలకు వచ్చేవారందూ పార్టీ ఓటేయరని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాగ్ధాటి, ఇమేజ్ గల నాయకుడు కావాలని తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గం భావిస్తోంది.












Click it and Unblock the Notifications