వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రితో జూ ఎన్టీఆర్ కలిసి తిరుగుతారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Harikrishna and JR Ntr
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తండ్రి హరికృష్ణ తిరుగుబాటు చేస్తున్న స్థితిలో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన తండ్రికి మద్దతుగా బహిరంగంగా ముందుకు వస్తారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు.

రామయ్యా వస్తావా, రభస సినిమాల్లో ఆయన ప్రస్తుతం నటిస్తున్నారు. మరో సినిమా కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. సినిమాల పేరు చెప్పి మౌనంగా ఉండిపోతారా, తండ్రికి మద్దతుగా ముందుకు వస్తారా అనేది చెప్పలేని స్థితి ఉంది. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనూహ్యంగా ఆయన రాజీనామా ఒక్కటే ఆమోదం పొందింది.

సమైక్యనినాదాన్ని అందుకుని హరికృష్ణ తన తండ్రి ఎన్టీ రామారావు పుట్టిన ఊరు నిమ్మకూరు నుంచి చైతన్య రథయాత్ర చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన అన్న తెలుగుదేశం పార్టీని కూడా పునరుద్ధరిస్తారని అంటున్నారు. హరికృష్ణ ఒకటి రెండు రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించవచ్చునని అంటున్నారు.

హరికృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ చైతన్య రథయాత్రలో పాల్గొంటే తెలుగుదేశం పార్టీ ఏమవుతుంది, దాని ప్రభావం ఎలా పడుతుందనే విషయాలపై అప్పుడే చర్చ సాగుతోంది. హరికృష్ణ నిర్ణయంతో తెలంగాణలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఆడనివ్వబోమని తెలంగాణవాదులు హెచ్చరించారు. హరికృష్ణతో పాటు నేరుగా యాత్రలో పాల్గొంటే ఆ ప్రభావం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై ఏ మేరకు పడుతుందనే చర్చ కూడా నడుస్తోంది. ఏమైనా, జూనియర్ ఎన్టీఆర్ బహిరంగంగా ముందుకు వచ్చినప్పుడే దాని ప్రభావాల గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది.

English summary
A debate is going on wether Nandamauri hero Jr NTR come out openly supporting his father Harikrishna in his fight against Telugudesam party president Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X