వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ క్యాంప్‌లో మళ్లీ వైయస్ మీడియా మ్యాన్?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోనే కాకుండా, కాంగ్రెసు అధికారంలోకి రాక ముందు కూడా సుంకర రవిచన్ తెగ హడావిడి చేస్తుండేవాడు. అతను వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. సాదాసీదాగా కనిపించే అతనికి మీడియా ప్రతినిధులతో సన్నిహిత సంబంధాలుండేవి. దాంతో అతను వైయస్‌కు అనుకూలంగా మీడియా ప్రతినిధులను మలిచేందుకు తెగ ప్రయత్నించేవాడు.

అతని చెవులు, కళ్లు కూడా వైయస్ కోసమే పనిచేసేవని అంటారు. వైయస్ మరణం తర్వాత వైయస్ కుటుంబంతో కలిసి పోవడానికి ప్రయత్నించాడు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు అనుకూలంగా వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించాడు. కారణమేమిటో తెలియదు గానీ దాదాపు మూడేళ్ల పాటు తెర వెనక ఉండిపోయాడు. జగన్ ఆధిక్యతా ధోరణి అతనికి నచ్చలేదని అంటారు.

అయితే, తిరిగి అతను జగన్ క్యాంపులోకి అడుగు పెట్టాడు. వైయస్ జగన్‌ను మళ్లీ ఎలా ఆకర్షించాడో తెలియదు గానీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ప్రెస్ నోట్లు, ఫొటోలు పంపడంలో తీరిక లేకుండా గడుపుతున్నాడు. అయితే, ఇంకా రవిచన్ పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకోలేదని, త్వరలోనే కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నాడని అంటున్నారు.

తెర వెనక ఉండిపోయిన మూడేళ్ల పాటు రవిచన్ భారత రాజకీయాలపై, రాజకీయ ధోరణులపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో అధ్యయనం చేశాడట. అదేమైనా జగన్‌కు ఉపయోగపడుతుందా...

English summary
YS Rajasekhar Reddy's nedia man Sunkara Ravichan reappeared in YSR Congress president YS Jagan camp. Ravichan has worked to build uo YS Rajasekhar Reddy's givernment through media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X