డ్యూటీలో ఉండగానే నైట్ బార్ గర్ల్స్‌తో ఏఎస్సై చిందు
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో ఓ పోలీసు అధికారి బార్‌లో బార్ గర్ల్స్‌తో చిందులు వేశాడు. ఈ వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ సృష్టిస్తోంది. దీంతో పోలీసులు సదరు అధికారి పైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. సూరత్‌కు చెందిన ఓ ఏఎస్సై బార్‌లో గర్స్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో బయటకు వచ్చింది. దీంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీని పైన తాము ప్రాథమిక విచారణకు ఆదేశించామని పోలీసు అధికారులు తెలిపారు. సూరత్ నగరంలోని దిండోలి ప్రాంతంలో అతను బార్ గర్ల్స్‌తో డ్యాన్స్ చేసిన వీడియోను చూడగానే చర్యలు చేపట్టామని తెలిపారు. అంతేకాకుండా, అతను అలా చేసినప్పుడు ఆన్ డ్యూలో ఉన్నాడని తెలిపారు.

అతను ఈ నెల 19వ తేదీన ఓ కార్యక్రమం కోసం వెళ్లాడని, అక్కడే అతను బార్ గర్ల్స్‌తో డ్యాన్స్ చేశాడని చెప్పారు. అతను బార్ గర్ల్స్‌తో చిందులు వేసిన వీడియో వాట్సప్‌లో బయటకి వచ్చిందని చెప్పారు. డిపార్టుమెంట్ పరంగా అతని పైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
కాగా, సూరత్ పోలీసులు శుక్రవారం నాడు ఈ విషయమై నగర పోలీసు కమిషనర్‌కు ప్రాథమిక నివేదికన సమర్పించారు. నివేదికను చూసిన తర్వాత కమిషనర్ చర్యలు తీసుకోనున్నారు. కాగా, ఏఎస్సై బార్ గర్ల్స్‌తో చిందులు వేసింది, అతని పుట్టిన రోజు నాడు అని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications