24 ఏళ్ల యువతిని పెళ్లాడిన 77ఏళ్ల మంత్రి
న్యూఢిల్లీ: మణిపూర్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి పుంగ్ జథాంగ్ తోన్సింగ్ 77 ఏళ్ల వయసులో చేసుకున్నారు. తన కన్నా 53 ఏళ్లు చిన్నదైన తనాంగైసంగ్ అనే యువతిని పెళ్లాడారు. తనాంగైసంగ్ నర్సింగ్ విద్యార్ధిని. మంత్రి తోన్సింగ్‌కి ఇది రెండో పెళ్లి.
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో
ని ఇవాంజెలికల్ బాప్టిస్టు చర్చిలో వీరి వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ వేడుక కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్రామ్ ఇబోబిసింగ్‌తో పాటు, పలువురు ప్రముఖులు హాజరై నూతల వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

తోన్సింగ్ కుటుంబ సభ్యులందరూ రాష్ట్రం బయట నివసిస్తుండటంతో వృద్ధాప్యంలో తన బాగోగులు చూసుకునేందుకు ఈ పెళ్లి చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో 67 ఏళ్ల వయసున్న బంగ్లాదేశ్ రైల్వే శాఖ మంత్రి ముజుబుల్ హక్వీ, 29 ఏళ్ల హునుఫా అక్తర్ రిక్తా అనే యువతిని పెళ్లాడాడు. వీరి వివాహం బంగ్లాదేశ్‌లోని కోమిల్లా పట్టణంలో జరిగింది. ముజుబుల్ హక్వీకి ఇది మొదటి మ్యారేజి కావడం విశేషం.












Click it and Unblock the Notifications