గేల్‌తో వాదన, పొలార్డ్ నోటికి టేప్: రియాక్షన్(పిక్చర్స్)

బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాడు క్రిస్ గేల్‌తో ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్‌కు స్వల్ప వాగ్వాదం జరిగింది. దీని పైన అంపైర్లు మందలించడంతో పొలార్డ్ వెంటనే డగౌట్‌కు వెళ్లి, మూతికి టేపు అంటించుకొని వచ్చి అంపైర్ల చర్య పట్ల నిరసన, అసంతృప్తి వ్యక్తం చేశాడు.

అతనిని అంపైర్లు రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, వినీత్‌లు మందలించారు. ఈ ఘటన బెంగళూరు ఇన్నింగ్స్ మూడో ఓవర్ సందర్భంగా జరిగింది. తోడి విండీస్ ఆటగాడు గేల్‌తో పొలార్డ్ వాగ్వాదానికి దిగాడు. పొలార్డ్ నోటికి ప్లాస్టర్ అంటించుకొని నిరసన తెలపడంపై సామాజిక అనుసంధాన వేదికలలో జోరుగా కామెంట్లు వస్తున్నాయి.

From Twitter: Reactions to Kieron Pollard's bizarre plastered mouth during RCB-MI match

కాగా, క్రిస్ గేల్ ఆడుతున్న సమయంలో అతనిని అప్ సెట్ చేసేందుకే పొలార్డ్ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.త మరో విషయమేమంటే పొలార్డ్ తన మూతికి ప్లాస్టర్ అంటించుకొని వచ్చాక కూడా ఏదో వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆర్సీబీ పైన విజయం సాధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+