అధ్యక్ష పదవి రేసులో లేను: ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష రేసులో తాను లేనని తెలంగాణ టిడిపి శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు శనివారం నాడు చెప్పారు. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిని తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేస్తారన్నారు.
ఆయన ఎవరిని ఎంపిక చేసినప్పటికీ తన సహకారం ఉంటుందని ఎర్రబెల్లి చెప్పారు. ఐవీఆర్ఎస్ ద్వారా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఇతర పార్టీ బాధ్యులను ఎంపిక చేస్తానని చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే.

మూడు రోజుల క్రితం టిడిపి నేతలు విజయవాడలో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఐవీఆర్ఎస్ ద్వారా అద్యక్షుడిని ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎవరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే విషయమై చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications