సినిమాలో ఇద్దరు భార్యల కథ: అజర్ డోంట్ కేర్
ముంబై: వివాదాస్ప హైదరాబాద్ మాజీ క్రికెటర్, మాజీ పార్లమెంటు సభ్యుడు మొహ్మద్ అజరుద్దీన్ మరోసారి చర్చనీయాంశంగా మారబోతున్నాడు. అతని ఆత్మకథ తెరకెక్కుతోంది. సినిమాలోని మూడు విషయాలపై తనకు అభ్యంతరమేమీ లేదని ఆజర్ బోల్డ్‌గా చెప్పేశాడు. గురువారంనాడు ప్రివ్యూ ప్రజంటేషన్ కార్యక్రమానికి ఎమ్రాన్ హష్మీతో కలిసి అజర్ హాజరయ్యారు. అజరుద్దీన్ పాత్రను ఎమ్రాన్ హష్మి పోషిస్తున్నారు.
సినిమా పేరు కూడా వివాదాలకు తావిచ్చిన అంశాలను ఆధారం చేసుకునే పెట్టారు. ఎక్ ఖుదా, దో షాదీ ఔర్ మ్యాచ్ ఫిక్సింగ్ (ఒక దేవుడు, రెండు పెళ్లిళ్లు, మ్యాచ్ ఫిక్సింగ్) అనేది సినిమా పేరు. మైదానంలో కన్నా మైదానం వెలుపల ఆసక్తికరమైన సంఘటనలు అజర్ జీవితంలో చోటు చేసుకున్నాయి. అవి నాటకీయంగా కూడా ఉంటాయి.

అన్ని ప్రధానమైన విషయాలను సినిమాలో కవర్ చేసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోందని అజర్ అన్నారు. ఆ సంఘటలన్నీ తన జీవితానికి సంబంధించినవేనని చెప్పారు. ఈ సినిమా విడుదలైన తర్వాత హష్మిని అజర్ పిలువడం ఖాయమనే ధీమాను కూడా అజర్ వ్యక్తం చేశారు.
ట్వంటీ20 ఫార్మాట్ రాక ముందు, క్రికెట్ తెర మీదికి సచిన్ టెండూల్కర్ రాక ముందు భారత క్రికెట్ చరిత్రలో అజరుద్దీన్ మాత్రమే పోస్టర్ బాయ్. ట్వంటీ20 ఫార్మాట్‌కు ముందు అత్యంత ప్రతిభావంతమైన ఫీల్డర్‌గా అజర్ పేరు గాంచాడు. మణికట్టు మాయాజాలం అనేది బ్యాటింగ్‌కు సంబంధించి అజర్‌తోనే పాపులర్ అయింది. అజరుద్దీన్ జీవితంలో ఆనందకరమైన సంఘటనలు ఎన్ని ఉన్నాయో విషాదకకరమైన సంఘటనలు కూడా అన్నే ఉన్నాయి.
మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కుని నిషేధానికి గురైన క్రికెటర్‌గా అజర్ తీవ్రమైన వివాదాన్ని ఎదుర్కున్నాడు. సంగీతా బిజలానీతో ఆయన ప్రేమాయణం గురించి కథలు కథలుగా ప్రచారమవుతూ వచ్చింది. గంగూలీ, విరాట్ కోహ్లీ వీరందరి కన్నా ముందు అజర్ ఆ విషయంలో చర్చనీయాంశంగా మారాడు.












Click it and Unblock the Notifications