Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్చ్ లాభంలేదు: ఏళ్లకు ముంబై స్టేడియంలో షారూక్

ముంబై: కోల్‌కతా నైట్ రైడర్స్ సహయజమాని, బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ ముంబైలో ఐపీఎల్ మ్యాచ్ చూశాడు. అయితే, అతను మ్యాచ్ చూసింది.. వాంఖేడే స్టేడియంలో కాదు. ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియం. శనివారం నాడు రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్‌లో కోల్‌కతా పైన రాజస్థాన్ తొమ్మిది పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ చూసేందుకు షారూక్ హాజరయ్యాడు. కానీ ఆయన జట్టు కోల్‌కతా ఓడిపోయింది. ఇప్పుడు ప్లే ఆఫ్ రేసులో సాంకేతికంగా ఉన్నప్పటికీ.. కష్టమేనని చెప్పవచ్చు. షారూక్ మూడేళ్ల తర్వాత ముంబైలో ఐపీఎల్ మ్యాచ్ చూశాడు.

2012లో జరిగిన ఓ వివాదం వల్ల షారూక్ ఖాన్‌ను వాంఖేడేలోకి ఐదేళ్ల పాటు నిషేధించారు. అయితే, రాజస్థాన్ - కోల్‌కతా మ్యాచ్ బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగింది. దీంతో అతను మూడేళ్ల తర్వాత ముంబైలో మ్యాచ్ చూశాడు. ఈ మ్యాచ్‌కు తనయుడు అబ్ రామ్‌తో కలిసి వచ్చాడు.

షారూక్ ఖాన్

షారూక్ ఖాన్

షారుక్‌ ఖాన్‌ మళ్లీ ముంబై స్టేడియంలో స్టాండ్స్‌ నుంచి మ్యాచ్‌ చూస్తూ కనిపించాడు. 2012 తర్వాత ముంబై స్టేడియంలో షారుక్‌ కనిపించడం ఇదే తొలిసారి. బ్రబౌర్న్‌ స్టేడియంలో కోల్‌కతా, రాజస్థాన్‌ మ్యాచ్‌ను స్టాండ్స్‌ నుంచి తిలకించాడు. వాంఖడే స్టేడియంలోకి రాకుండా ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ షారుక్‌పై విధించిన ఐదేళ్ల నిషేధం కొనసాగుతోంది.

రాజస్థాన్ - కోల్‌కతా

రాజస్థాన్ - కోల్‌కతా

కెప్టెన్ షేన్ వాట్సన్ (59 బంతుల్లో 104 పరుగులు) రెచ్చిపోవడంతో 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 199 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 9 వికెట్లకు 190 పరుగులకు పరిమితం చేయడం ద్వారా 9 పరుగుల తేడాతో గెలిచింది.

రాజస్థాన్ - కోల్‌కతా

రాజస్థాన్ - కోల్‌కతా

తద్వారా ప్లే ఆఫ్‌కు వచ్చింది. షేన్ వాట్సన్ ఆల్‌రౌండ్ ప్రతిభ రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఐపీఎల్ ఆరంభంలో వరుసగా ఐదు మ్యాచులు ఆడిన రాజస్థాన్.. వర్షం పడటంతో రెండు మ్యాచులు రద్దు కావడం, మిగతా మ్యాచులలో ఓడిపోవడం ద్వారా ప్లే ఆఫ్ పైన సస్పెన్స్ సాగింది.

రాజస్థాన్ - కోల్‌కతా

రాజస్థాన్ - కోల్‌కతా

తొలుత వరుసగా ఐదు మ్యాచులు గెలిచిన రాజస్థాన్ తొలి ప్లే ఆఫ్ జట్టుగా అవుతుందనుకున్నారు. అనూహ్యంగా అది ఆ తర్వాత పరాజయాల బాట పట్టింది. చావోరేవో అనుకున్న చివరి మ్యాచులో గెలిచి ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. రాజస్థాన్ ఆల్ రౌండర్ ప్రదర్శన చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+