బాబుకు బాగాలేదు!: జగన్‌లో 'జ్యోతిష్యం' ఉత్సాహం

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి... ఎప్పటికప్పుడు తాను త్వరలో ముఖ్యమంత్రిని అవుతానని, అధికారంలోకి రానుంది మన పార్టీయేనని చెబుతుంటారు.

తానే కాబోయే సిఎం అని జగన్‌కు మరింత విశ్వాసాన్నిచ్చే విషయం ఇటీవల జరిగిందని తెలుస్తోంది. నిత్యం జగన్ తాను కాబోయే సిఎంనని అభిప్రాయపడుతుంటారు.

ఇటీవల జగన్ జాతకం చూసిన ఓక జ్యోతిష్కుడు.. 2017లో మీరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారట. దివంగత వైయస్ విమాన ప్రమాదాన్ని అదే జ్యోతిష్కుడు ముందుగానే ఊహించి చెప్పారని, దాంతో జగన్‌కు ఆయన పైన గురి కుదిరిందని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.

When YSRCP chief YS Jagan will become the CM?

ప్రస్తుతం చంద్రబాబు గ్రహ స్థితి బాగా లేదని, రెండేళ్లలో జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారట. ఆ జ్యోతిష్కులు రమణారావు. ఈయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఒకప్పుడు చాలా దగ్గర. 2009 ఎన్నికల సమయంలో చంద్రబాబు, కెసిఆర్ మధ్య సీట్లు సర్దుబాటు సమయంలోను ఈయన కీలక భూమిక పోషించారనే వాదనలు ఉన్నాయి.

ఈయనను ఇటీవల జగన్ వద్దకు తీసుకెళ్లారని, జగన్ జాతకం చూసిన రమణరావు... చంద్రబాబు గ్రహస్థితి బాగా లేదని, 2017లో మీరు సీఎం అవుతారని చెప్పారని తెలుస్తోంది. అయితే, జగన్‌కు ఆకాశ యాంలో ప్రమాదం ఉన్న నేపథ్యంలో శాంతిహోమం కూడా చేయమని చెప్పారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+