భార్య చెప్తే వినకుంటే నో ఫుడ్: బాబు కామెంట్
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారని అనుకుంటారు. కానీ ఆయన కూడా చమత్కారాలు వేస్తారని, నవ్విస్తారని, నవ్వుతారని తాజా సంఘటన ఒకటి రుజువు చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిన జన్మభూమి గ్రామ సభలో శుక్రవారం ఆ ఉదంతం చోటు చేసుకుంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన జన్మభూమి గ్రామసభలో సీఎం పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. ఓ లబ్ధిదారుడితో ముఖ్యమంత్రి సంభాషణ ఆసక్తికరగా సాగింది. ఆ సంభాషణ ఇలా ఉంది.

చంద్రబాబు: మీ పేరు? ఏం చేస్తుంటారు?
లబ్ధిదారుడు: వీరాచారి. కార్పెంటర్‌ని.
చంద్రబాబు: మీ భార్య చదువుకున్నారా?
లబ్ధిదారుడు: డిగ్రీ వరకు చదువుకున్నారు.
చంద్రబాబు: చాలా చదువుకుంది. ఆమె అంత చదువుకుందని మీకు ఏమైనా అసూయగా ఉందా?
లబ్ధిదారుడు: ఏమీ లేదు, సంతోషంగానే ఉంది.
చంద్రబాబు: మీ మాట అమ్మాయి వింటుందా.. లేక మీ ఆవిడ మాట మీరు వింటారా?
లబ్ధిదారుడు: నా మాట ఆవిడ.. ఆవిడ మాట నేను వింటాం.
దానికి చంద్రబాబు ప్రత్సిస్పందిస్తూ "చాలా తెలివిగా సమాధానం చెప్పావు. అయినా.. అలా చెప్పకపోతే నీకు ఫుడ్ ఉండదు కదా" అని అన్నారు. దాంతో అక్కడ నవ్వుల పువ్వులు విరిశాయి.












Click it and Unblock the Notifications