వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్త్రీలకు వేధింపు: 263ఏళ్ల జైలు శిక్ష, కోర్టులో ఏడ్చాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఓక్లహోమా: అమెరికాలో ఓ పోలీసుకు న్యాయస్థానం 263 ఏళ్ల జైలు శిక్ష విధించింది. విధి నిర్వహణలో మహిళలను లైంగికంగా వేధించినందుకు అతనికి ఆ శిక్షను విధించింది. నిందితుడు 19 ఏళ్ల డేనియల్ హాల్ట్ క్లాక్. అతను 2013-14 మధ్య పలువురు మహిళలను పలువురు మహిళను వేధించిన ఆరోపణలున్నాయి.

నిందితుడు డేనియల్‌కు 263 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఓ సంచలన తీర్పు చెప్పిన అమెరికా కోర్టు.. అతనిని హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిరాకరించింది. మహిళలను అఘాయిత్యాల నుంచి రక్షించాల్సిన గురుతర బాధ్యత ఉన్న ఓ పోలీసు అధికారి తానే భక్షకుడిగా మారడం అందర్నీ షాక్‌కు గురి చేసింది.

Oklahoma City cop convicted of rape sentenced to 263 years in prison

అతను విధి నిర్వహణలోనే పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు దిగాడు. అత్యాచారపర్వాన్ని కొనసాగించాడు. పోలీసు అధికారి హోదాను అడ్డం పెట్టుకుని కొందరిని లొంగదీసుకున్న అతడు, మరికొందరిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

కోర్టు విచారణలో దోషిగా తేలాడు. అతడికి 263 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో అతడు కోర్టులోనే కన్నీటి పర్యంతమయ్యాడు. వందల ఏళ్ల జైలు శిక్షను ప్రకటించిన జడ్జి... సదరు తీర్పుపై పై స్థాయి కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశాన్ని కూడా నిందితుడికి ఇవ్వకపోవడం గమనార్హం.

English summary
Oklahoma City cop convicted of rape sentenced to 263 years in prison
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X