నేనే దేవుణ్ని, హీరోయిన్లని బట్టల్లేకుండా: వర్మ, 'వంగవీటికి జగన్ డైరెక్షన్'
విజయవాడ: నేనే దేవుడిని అని తన నమ్మకం అని, అందుకే దేవుడి కథలతో సినిమాలు చేయనని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పాడు. స్వయంగా యముడు వచ్చి తన మెడ మీద కత్తి పెట్టినా తాను పురాణాలు, దేవుళ్ల సినిమాలు తీయనని చెప్పాడు.
వర్మ గుంటూరు జిల్లాలోను విద్యార్థులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహాభారతంలో కన్నా బెజవాడలోనే ఎక్కువగా హింస జరిగిందన్నాడు. తాను దేవుడిని నమ్మనని, అలాగే దేవుడి పైన సినిమాలు తీయనని చెప్పాడు.
అంతేకాదు, నా సినిమాల్లో హీరోయిన్లను బట్టలు లేకుండా చూపించేందుకే ఎక్కువ ఖర్చు పెడతానని కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడట. తన చిత్రాల్లో హీరోయిన్లను బట్టలు లేకుండా చూపించేందుకు ఎక్కువ ఖర్చుపెడతానని రామ్ గోపాల్ వర్మ సమాధానం చెప్పినప్పుడు... అమ్మాయిలు ఒకింత ఇబ్బంది పడ్డారట.
కాగా, రామ్ గోపాల్ వర్మ విజయవాడలో పర్యటించిన నేపథ్యంలో ఉద్రిక్తత కనిపించిన విషయం తెలిసిందే. శనివారం నాడు వర్మ తన స్నేహితుడు, మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్, కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ తదితరులను కలిశారు. అనంతరం శనివారం సాయంత్రం హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు.
ఇదిలా ఉండగా, వంగవీటి సినిమా పైన టిడిపి నేతలు మండిపడుతున్నారు. టిడిపి ఎమ్మెల్యే బోండ ఉమ మాట్లాడుతూ... బెజవాడలో వంగవీటి సినిమాతో ఉద్రిక్త పరిస్థితులు లేవనెత్తడం వర్మకు సరికాదన్నారు. కాపునేత శ్రీనివాస రావు మాట్లాడుతూ.. వంగవీటి సినిమాకు డైరెక్షన్ వైయస్ జగన్ అయితే రామ్ గోపాల్ వర్మ యాక్షన్ చేస్తున్నాడని విమర్శించారు.

దేవినేని నెహ్రూతో..
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూతో మాట్లాడారు. వంగవీటి సినిమా విషయమై పలు విషయాలు ఆరా తీశారు.

రామ్ గోపాల్ వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూతో మాట్లాడారు. వంగవీటి సినిమా విషయమై పలు విషయాలు ఆరా తీశారు.

విద్యార్థులతో..
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శనివారం నాడు ఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ముచ్చటించారు. హాజరైన విద్యార్థులు.

విద్యార్థులతో..
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శనివారం నాడు ఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ముచ్చటించారు. మాట్లాడుతున్న వర్మ..












Click it and Unblock the Notifications