నామినేషన్ తిరస్కరణలో ఊహించని మలుపులెన్నో, ఆడియో రిలీజ్‌తో విశాల్ షాక్: ఏం జరిగిందంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికల బరిలోకి దిగుతామనుకున్న నటుడు విశాల్‌కు చుక్కెదురైంది. విశాల్‌తో పాటు జయలలిత కోడలు దీపా జయకుమార్, మరికొందరు స్వతంత్ర్య అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. విశాల్ నామినేషన్ తిరస్కరణపై హైడ్రామా నడిచింది.

  RK Nagar by-Polls : Vishal's Nomination Rejected, Accepted And Rejected Again

  నామినేషన్‌పై ఈసీ షాక్: ఫ్యాన్స్‌తో కలిసి రోడ్డుపై ధర్నాకు దిగిన హీరో విశాల్ అరెస్టు

  దీనిపై బుధవారం ఓ వైపు ఎన్నికల సంఘం అధికారులు, మరోవైపు విశాల్ స్పందించారు. విశాల్ నామినేషన్ సందర్భంగా 10 మంది ప్రపొజర్స్ సంతకం చేశారు. ఇందులో ఇద్దరి సంతకం ఫోర్జరీ అని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

   బెదిరించారని చెబుతూ విశాల్ ఆడియో విడుదల

  బెదిరించారని చెబుతూ విశాల్ ఆడియో విడుదల

  దీనిపై విశాల్ స్పందించారు. ఆ ఇద్దరిని అన్నాడీఎంకే పార్టీ బెదిరించిందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ఆడియో కూడా విడుదల చేశారు. అన్నాడీఎంకేలోని మధుసూదన్ వర్గం ఆ ఇద్దరిని బెదిరించిందన్నారు. ఆ వీడియోలో తన మద్దతుదారుల స్టేట్‌మెంటును ఉంచినట్లుగా తెలుస్తోంది.

  విశాల్ ఆరోపణలను ఖండించిన మధుసూదన్ వర్గం

  విశాల్ ఆరోపణలను ఖండించిన మధుసూదన్ వర్గం

  విశాల్ ఆరోపణలను అన్నాడీఎంకే ఖండించింది. విశాల్ మద్దతుదారులను తాము బెదిరించామన్నది అవాస్తవం అని వారు తెలిపారు. తాము ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని మధుసూదన్ వర్గం వెల్లడించింది. తమపై విశాల్, ఆయన వర్గం అనవసర ఆరోపణలు చేస్తోందన్నారు.

   పోటీలో లేకున్నా స్వతంత్ర అభ్యర్థికి మద్దతు

  పోటీలో లేకున్నా స్వతంత్ర అభ్యర్థికి మద్దతు

  తన నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఆర్కే నగర్ బరిలో ఉన్న పార్టీలకు విశాల్ దిమ్మతిరిగే షాకిచ్చారు. తాను పోటీలో లేకపోయినప్పటికీ మరో స్వతంత్ర అభ్యర్థికి తాను మద్దతు ప్రకటిస్తానని తెలిపారు. ఉన్న స్వతంత్రుల్లో మంచి అభ్యర్థిని చూసి మద్దతు ఇచ్చే అవకాశముంది.

   అంతలోనే షాకిచ్చారు

  అంతలోనే షాకిచ్చారు

  కాగా, విశాల్ నామినేషన్ పైన మంగళవారం హైడ్రామా చోటు చేసుకుంది. తొలుత ఆయన నామినేషన్ తిరస్కరించారు. ఆ తర్వాత ఆయన రోడ్డెక్కారు. అరెస్ట్ అయ్యారు. నిరసనల మధ్య ఆమోదించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో విశాల్... సత్యం గెలిచింది. నా నామినేషన్ ఆమోదించారని ట్వీట్ చేశారు. ఆ తర్వాత మంగళవారం రాత్రి గం.11.30 నిమిషాలకు తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

   వీరిద్దరి సంతకాలే ఫోర్జరీ అంటూ

  వీరిద్దరి సంతకాలే ఫోర్జరీ అంటూ

  సాంకేతిక కారణాల వల్ల విశాల్ నామినేషన్ తిరస్కరించినట్లు అధికారులు ప్రకటించారు. నామినేషన్‌ పత్రంలో దీపన్‌, సుమతి అనే ఇద్దరి సంతకాలను ఫోర్జరీ చేయడంతో విశాల్‌ నామినేషన్‌ తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారి పేర్కొన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 7వ తేదీ వరకు గడువు ఉంది. అప్పుడే అభ్యర్థుల గుర్తులపై కూడా ఒక స్పష్టత వస్తుంది. తిరస్కరణపై అప్పీల్‌ చేయనున్నట్లు విశాల్‌ తండ్రి జీకే రెడ్డి తెలిపారు.

   ఏం జరిగిందంటే

  ఏం జరిగిందంటే

  అంతకుముందు విశాల్‌కు సుమతి, దీపన్ మద్దతుగా సంతకాలు చేశారని అంటున్నారు. కానీ ఆ తర్వాత తమ సంతకాలు ఫోర్జరీ చేశారని ఈసీకీ లేఖ ఇచ్చారు. దీంతో ఈ అంశం కొత్త మలుపు తిరిగింది. తన నామినేషన్ పత్రాల తిరస్కరణపై విశాల్, ఆయన వర్గం పదిమంది ప్రపోజర్లలో ఒకరైన సుమతి సమీప బంధువు వేలుకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్, ఆయన అనుచరుడు రాజేష్ తమ ఇంట్లో మహిళల్ని బెదిరించారని, కొంత డబ్బు ఇచ్చేందుకు కూడా ప్రయత్నించారని, అందుకే తమ కుటుంబ సభ్యులు రిటర్నింగ్ అధికారికి తమవి ఫోర్జరీ లేఖలు అని ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను విశాల్ విడుదల చేశారు. దీంతో వివాదం పెద్ద మలుపు తిరిగింది.

   రిటర్నింగ్ అధికారికి ఆడియో క్లిప్

  రిటర్నింగ్ అధికారికి ఆడియో క్లిప్

  సుమతి బంధువు చెప్పిన ఆడియోను విశాల్ వర్గం రిటర్నింగ్ అధికారికి ఇచ్చింది. చీఫ్ ఎన్నికల కమిషనర్ ఏకే జ్యోతితోను విశాల్ మాట్లాడారు. దీంతో ఈసీ ఆదేశాల మేరకు నామినేషన్‌ను రాత్రి ఎనిమిదిన్నర గంటలకు పరిగణలోకి తీసుకున్నారు. కానీ ఆ తర్వాత పదకొండున్నర గంటలకు తిరస్కరించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Actor Vishal released the audio of his supporters statement that Madhusudhanan faction threatened them to go against Vishal, at the same time Madhusudhanan faction rejected teh charges.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి