ఇది నిజంగా వండర్..: జపాన్‌లో పోగొట్టుకుంటే.. తైవాన్‌లో దొరికింది..
హైదరాబాద్: ఇది నిజంగా అబ్బురపరిచే విషయమే. లేకపోతే.. రెండేళ్ల క్రితం సముద్రంలో పోగొట్టుకున్న కెమెరా తిరిగి దొరకడమంటే మాటలు కాదు కదా. అది కూడా.. పోగొట్టుకున్నది ఓ దేశంలో అయితే.. తిరిగి దొరికింది మరో దేశంలో. ఇంతకీ ఎవరా అదృష్టవంతురాలు అంటే.. జపాన్‌కు చెందిన సెరేనా సుబాకిహర.
చాలా కాలంగా ఎన్నో జ్ఞాపకాలను బంధించిన ఆ కెమెరా దురదృష్టవశాత్తు సముద్రంలో పడిపోవడంతో ఆమె పడిన బాధ అంతా ఇంతా కాదు. కానీ ఏం చేస్తుంది?.. బాధపడి లాభం లేదనుకుని ఇక ఆ విషయమే మరిచిపోయింది.

ఈ నేపథ్యంలో.. ఈ నెల 27న తైవాన్‌కి చెందిన పార్క్ లీ అనే టీచర్.. తన స్టూడెంట్స్ తో కలిసి స్థానికంగా ఉన్న బీచ్ ను శుభ్రం చేయడానికి వెళ్లారు. బీచ్ లో పేరుకుపోయిన చెత్తా, చెదారాలను క్లీన్ చేస్తున్న సమయంలో వారి కంటికి ఏదో కెమెరా లాంటి వస్తువు కనిపించింది.
దగ్గరికెళ్లి చూస్తే అది నిజంగానే కెమెరానే. కానీ అంతా పాచి పేరుకుపోయి ఉంది. అయితే అది వాటర్ ప్రూఫ్ కావడంతో.. ఇప్పటికీ ఆ కెమెరా చక్కగా పనిచేస్తోంది. కెనాన్ పవర్ షాట్ జీ 12గా దాన్ని గుర్తించారు.
అయితే ఆ కెమెరా ఎవరిదో ఎలా తెలుసుకోవాలన్న సందేహం వెంటాడింది. మెమొరీ కార్డులోని ఫోటోలు, వీడియోలు చూస్తే వివరాలు దొరకవచ్చు కానీ.. అందులో 'ప్రైవసీ' కంటెంట్ ఏమైనా ఉండవచ్చేమో అన్న సందేహం కూడా కలిగింది. అయితే వివరాల కోసం ఎట్టకేలకు మెమొరీ కార్డు గ్యాలరీ ఓపెన్ చేయక తప్పలేదు.
అందులోని ఫోటోలను పరిశీలించగా.. చివరిసారిగా సెప్టెంబర్ 7, 2015లో ఫోటోలు తీసినట్టు గుర్తించారు. రెండేళ్లు సముద్రంలో ఉన్నా కూడా.. ఆశ్చర్యంగా.. ఆ కెమెరా బ్యాటరీ చార్జింగ్ ఇంకా అయిపోలేదు. మెమొరీ కార్డులో ఉన్న ఫోటోలను పరిశీలిస్తే.. అవి జపాన్ ద్వీపంలోని ఇషిగాకిలో తీసినవిగా గుర్తించారు. ఆ నగరం తైవాన్ కు తూర్పు దిక్కుగా 250కి.మీ దూరంలో ఉన్నది.

మొత్తం మీద పలు వివరాలు దొరకడంతో.. వాటితో పాటు కెమెరా ఫోటోల్ని జతచేసి ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు పార్క్ లీ. ఆమె పోస్ట్ చేసిన 12గంటల్లోనే 13,000 మంది షేర్ చేయడంతో.. ఎట్టకేలకు అది సెరేనా సుబాకిహరకి చేరింది. రెండేళ్ల క్రితం పోయిన కెమెరా తిరిగి దొరకడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు.
'నేనిప్పటికీ దీన్ని నమ్మలేకపోతున్నా.. కానీ నా కెమెరా తిరిగి నా వద్దకు చేరుకోవడంలో సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. నిజంగా నేను చాలా లక్కీ. త్వరలోనే తైవాన్ వెళ్లి పార్క్ లీతో పాటు ఆమె స్టూడెంట్స్ ను కూడా కలవబోతున్నాను' అని సెరేనా సంతోషం వ్యక్తం చేశారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications