సినిమాలో మాదిరే: యువతితో సహజీవనం, పురుషుడిలా డ్రెస్, కిలాడీ లేడీ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: అబ్బాయిలా వేషం వేసుకొని దారి దోపిడిలకు పాల్పుడుతున్న ఓ కిలాడీ లేడీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సోనియా అలియాస్ చీరా అనే యువతి దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తోంది. మరో మహిళతో సహజీవనం చేస్తూ ఆమెను పోషించేందుకు దోపిడిలకు పాల్పడుతున్నట్టు నిందితురాలు చెప్పడం గమనార్హం.

మరో స్వాతి: ప్రియుడితో రాసలీలలు, టెక్కీ నాగరాజు హత్య, కాల్ డేటా పట్టించింది

అచ్చు సినిమాల్లో తలపించే ఘటననే న్యూఢిల్లీలో చోటు చేసుకొంది. ఇద్దరు యువతులు సహజీవనం చేస్తున్నారు. న్యూఢిల్లీలోని అంబికా విహర్‌లోని సి బ్లాక్ ‌లో నివాసం ఉంటున్నారు.

మొదటి భర్త అనుమతితో లవర్‌తో వివాహం: పోలీసులకు ఫిర్యాదు, ఏమైందంటే?

అయితే సోనియా అలియాస్ చీరా అనే యువతి పురుషుల మాదిరిగా దుస్తులు ధరించి వ్యాపారస్తులు, స్కూల్ పిల్లలను, యువకులను లక్ష్యంగా చేసుకొని దారి దోపిడిలకు పాల్పడుతుండేది. ఇంతకాలం పాటు ఆమె దోపిడిలు సాగాయి. అయితే ఓ మొబైల్ ఫోన్‌ను దొంగిలించిన కేసులో నిందితురాలు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడింది.

అబ్బాయిల వేషధారణ దారి దోపిడిలు

అబ్బాయిల వేషధారణ దారి దోపిడిలు

సోనియా అలియాస్ చీరాకు 22 ఏళ్ళు. ఆమె అచ్చు పురుషుడిగా దుస్తులను ధరిస్తోంది. ఆమెను పరీక్షగా చూసిన అమ్మాయి అని భావించరు. ఇదే ఆమెకు కలిసివచ్చింది. సోనియా పురుషుల మాదిరిగా దుస్తులను ధరించి న్యూఢిల్లీలో దోపిడిలు చేస్తూ జీనవం సాగించేది. రోజు వారీ అవసరాలకు దోపిడిలు చేసిన డబ్బును ఉపయోగించేది.

మరో యువతితో సహజీవనం

మరో యువతితో సహజీవనం

అంబికా విహర్ ప్రాంతంలో సోనియా మరో యువతితో కలిసి సహజీవనం చేస్తోంది. కొంత కాలంగా వీరిద్దరూ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. తనతో సహజీవనం చేస్తున్న యువతి కోసమే సోనియా దోపిడిలకు పాల్పడుతున్నట్టు నిందితురాలు చెప్పడం గమనార్హం. ఆర్థిక సమస్యల కారణంగానే సోనియా దొంగతనాలను వృత్తిగా ఎంచుకొందంటున్నారు పోలీసులు.

సోనియా చిక్కిందిలా

సోనియా చిక్కిందిలా

ప్రతి రోజూ మాదిరిగానే బుదవారం కూడ పురుషుడి మాదిరిగా డ్రెస్ వేసుకొని రోడ్డుపైన సోనియా ఎదురుచూస్తోంది. అయితే పాఠశాల విద్యార్థి మనీష్ నుండి మొబైల్ ఫోన్‌ను దొంగిలించి పారిపోయింది. బ్లేడుతో పీక కోస్తానని బెదిరించి మరీ మొబైల్‌ను ఎత్తుకెళ్ళింది.అయితే పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో మొబైల్ లోకేషన్ ఆధారంగా నిందితురాలిని పట్టుకొన్నారు.

ఆశ్చర్యపోయిన పోలీసులు

ఆశ్చర్యపోయిన పోలీసులు

మొబైల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా పోలీసులు సోనియా నివసిస్తున్న ప్రాంతానికి వెళ్ళి ఆరా తీశారు. అయితే ఆ సమయంలో ఆ ఇంట్లో ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు. కానీ, దోపిడికి పాల్పడింది మాత్రం పురుషుడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయమై పోలీసులు టెక్నాలజీని ఉపయోగించారు. అయితే సోనియాను పోలీసులు నిలదీస్తే అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడు కాదని నిందితురాలని పోలీసులు గుర్తించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
She would dress up as a man, stand at secluded places in east and northeast Delhi and rob students and businessmen. This 22-year-old used a surgical blade to scare her victims and would flee the crime spot on a scooter.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి