Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

52ఏళ్ళ వయసులో యంగ్ హీరోయిన్స్ కు పోటీ.. మలైకా అరోరా ఫిట్నెస్ సీక్రెట్స్!

ఇటీవల మలైకా అరోరా రష్మిక మందన్నతో కలిసి థామా సినిమా కోసం పాయిజన్ సాంగ్ లో హాట్ డాన్స్ చేశారు. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో మలైకా అరోరా ఏజ్, రష్మిక మందన్నకు పోటీ ఇస్తున్న ఆమె అందంపైన చర్చ జరుగుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కంటే 52సంవత్సరాల ఈ హాట్ బ్యూటీ మలైకా అరోరానే బాగుందని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చ పెడుతున్నారు.

మలైకా అరోరా ఫిట్నెస్ సీక్రెట్స్
అసలు మలైకా అరోరా 52 సంవత్సరాల వయసులో కూడా ఇంత ఫిట్నెస్ తో, ఇంత అందంగా ఉండడానికి గల కారణమేమిటి? ఆమె డైలీ రొటీన్ ఏమిటి? ఇలా మెయింటైన్ చేయడం కోసం మలైకా అరోరా ఏం చేస్తారు? అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం మనం మలైకా అరోరా ఫిట్నెస్ సీక్రెట్స్ తెలుసుకుందాం.

52 years malaika arora competing with young heroines know Malaika Arora fitness secrets

మలైకా అరోరా ఫిట్నెస్ కోసం ఇలా చేస్తారు
మలైకా అరోరా ప్రతిరోజు యోగా చేస్తారు. తన శరీరానికి సరిపోయే వాటిని పాటిస్తూ మనసును ఫిట్ గా ఉంచుకోవడానికి ఆమె ప్రతిరోజు సాధన చేస్తారు. ఈ క్రమంలోనే ఆమె తన ఫిట్నెస్ సీక్రెట్స్ వెల్లడిస్తూ తన ఫిట్నెస్ కోసం తాను మూడు విషయాలలో చాలా శ్రద్ధ తీసుకుంటానని మలైకా అరోరా చెబుతున్నారు.

మూడు విషయాల్లో మలైకా అరోరా శ్రద్ధ
ప్రతిరోజు నాణ్యమైన నిద్రపోవడానికి, మంచి పోషకాలతో కూడిన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడానికి, శరీరానికి, మైండ్ కి కనెక్షన్ ఉండేలా యోగ సాధన చేయడానికి తను ప్రాధాన్యతను ఇస్తానని మలైకా అరోరా చెప్పారు. తాను ఎటువంటి ట్రెండ్ ను ఫాలో కానని, తన శరీరానికి ఏది సరిపోతే అదే చేస్తానని మలైకా అరోరా తెలిపారు.

మలైకా అరోరా డైట్ ఇలా
ఆహారం విషయంలో ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటానని ఇంట్లో వండిన భారతీయ వంటకాల కే ప్రాధాన్యతను ఇస్తానని చెప్పారు. ప్రతిరోజు ఆమె ఆహారంలో నెయ్యి ఉండేలా చూసుకుంటానని పేర్కొన్నారు ప్రతిరోజు వర్కౌట్ చేసిన తర్వాత గుడ్లు, టోస్ట్ లేదా దోశ వంటివి తింటానని తెలిపారు. శరీరంలో అదనపు ప్రోటీన్ కోసం ఖర్జూరాలు అరటి పండ్లు నట్స్ కలిపి ఇంట్లోనే షేక్స్ చేసుకుని తాగుతానని మలైకా అరోరా తెలిపారు.

యోగా, మంచి నిద్రతో ఫిట్నెస్
శరీరానికి కావలసిన ప్రోటీన్ కోసం ఎటువంటి ప్రోటీన్ పౌడర్లు తను వాడనని మలైకా అరోరా స్పష్టం చేశారు. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలతో యోగా చేస్తారు .యోగాతో పాటుగా HIIT ని , పిలేట్స్ వంటి వాటిని తప్పనిసరిగా చేస్తారు. ఇక మైండ్ ని కంట్రోల్ లో పెట్టుకోవడంతో పాటు, మంచి నాణ్యమైన నిద్రకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. దీనివల్ల 52 సంవత్సరాల వయసులో కూడా మలైకా అరోరా యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+