Anti aging tips: 40ఏళ్ళ తర్వాత కూడా యవ్వనంగా ఉండాలంటే ఇవి చెయ్యండి!!

చాలామంది 40 ఏళ్ళు దాటుతుంటే వృద్ధాప్య ఛాయలు వస్తున్నాయని తెగ బాధ పడుతూ ఉంటారు. అటువంటివారు వృద్ధాప్య ఛాయల నుంచి బయటపడడం కోసం కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అప్పుడే యవ్వనంగా కనిపిస్తాం. 40 ఏళ్ళు పై బడిన వారు ముసలి వాళ్ళం అవుతున్నామని టెన్షన్ పడతారు. కానీ టెన్షన్ పక్కన బెట్టి ఏం చెయ్యాలో తెలిసి ఉండటం మంచిది.

ముఖ్యంగా వ్యాయామంపై, ఆహారంపై, నిద్రపై వీరు దృష్టి పెట్టాలి. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. ప్రతీరోజూ శ్వాస వ్యాయామాలు చేస్తే కూడా యవ్వనంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక గంట పాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యంతో పాటు యవ్వనం కూడా ఉంటుంది.

Anti aging tips: Do these things to stay young even after 40 years!!

ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల నరాల బలహీనత తగ్గడంతోపాటు, చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. వ్యాయమంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చాలామందికి నలభై ఏళ్లు పైబడిన తర్వాత వయసు పెరిగే కొద్దీ నిద్ర మందగిస్తుంది. ఈ క్రమంలో సుఖవంతమైన, ఆరోగ్యవంతమైన నిద్రపోవడం కోసం చేతులు, తల, పాదాలను సుగంధ నూనెతో మసాజ్ చేసుకుంటే మంచిది.

సరైన నిద్ర 40 ఏళ్లు పైబడిన వారిని కూడా ఆరోగ్యంగా యవ్వనంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి వ్యాయామంతో పాటు నిద్ర చాలా అవసరం. ప్రతీరోజూ కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. ఇక 40 సంవత్సరాలు పైబడిన తర్వాత మనం మన ఆహారంలో కార్బోహైడ్రేట్ల మొత్తాన్ని తగ్గించాలి. ప్రోటీన్ మొత్తాన్ని బాగా పెంచాలి.

ఎందుకంటే వయసు పెరగడంతో పాటు మన శరీరం కణాల నష్టాన్ని ఎదుర్కొంటుంది. ఈ కణాల నష్టాన్ని మనం తీసుకునే ప్రోటీన్ తో నివారించగలుగుతుంది. కాబట్టి నలభై ఏళ్ళ వయసు పైబడినవారు ప్రధానంగా వ్యాయామం పైన, ఆహారం పైన, నిద్ర పైన దృష్టి సారించాలి. ఈ మూడింటిని ఎవరైతే సరిగా బ్యాలెన్స్ చేయగలుగుతారో వారు కచ్చితంగా వృద్ధాప్య ఛాయలకు దూరంగా యవ్వనంగా కనిపిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+