బీట్ రూట్ తెగ తింటున్నారా? అయితే జాగ్రత్త!
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చాలామంది ప్రధానంగా ఆహారం పైన దృష్టి సారిస్తున్నారు. మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాలని తీసుకోవడానికి చూస్తున్నారు. ఇక అలా మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాలలో బీట్ రూట్ ఒకటి.
బీట్ రూట్ తో ఆరోగ్యం
చాలామంది శరీరంలో రక్తం వృద్ధి చేసుకోవడం కోసం ఐరన్ లోపాన్ని తగ్గించుకోవడం కోసం బీట్ రూట్ ను తింటూ ఉంటారు. బీట్ రూట్ శరీరంలోని రక్తహీనతను తగ్గించడానికి ఎంతో బాగా పనిచేస్తుంది. అంతేకాదు మన చర్మ ఆరోగ్యానికి కూడా బీట్ రూట్ బాగా ఉపయోగపడుతుంది. బీట్ రూట్ జ్యూస్ తాగితే చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది.

బీట్ రూట్ తిన్నా, జ్యూస్ తాగినా జాగ్రత్త
అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని బీట్ రూట్ ను అతిగా తింటే మాత్రం అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీట్ రూట్ లో ఎక్కువ నైట్రేట్ ఉంటుంది. దీనిని ఎక్కువగా తీసుకుంటే మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. బీట్ రూట్ జ్యూస్ ను పదే పదే తాగితే కడుపులో నొప్పి వచ్చి ఇబ్బంది పడతారు.
ఈ సమస్యలు ఉన్న వారు బీట్ రూట్ తినొద్దు
కనుక బీట్ రూట్ జ్యూస్ తాగే విషయంలో పరిమితంగా తీసుకోవడం అవసరం. ఇక బీట్ రూట్ అలర్జీ సమస్యలు ఉన్నవారు తినకుండా ఉంటేనే మంచిది. అలర్జీ సమస్యలతో బాధపడేవారు బీట్ రూట్ తింటే ఆ సమస్య మరింత పెరుగుతుంది. చర్మంపై దురద, దద్దుర్లు, గొంతు సమస్య, వాపు వంటి లక్షణాలు వచ్చి ఇబ్బంది పడతారు. అందుకే అలర్జీతో బాధపడేవారు బీట్ రూట్ తినకుండా ఉంటేనే మంచిది.
డయాబెటిస్, కాలేయ సమస్యలు ఉంటె బీట్ రూట్ తినొద్దు
ఇక కాలేయం సమస్యతో బాధపడే వారు కూడా బీట్ రూట్ ఎక్కువ తినకూడదు. కాలేయం సమస్యతో బాధపడేవారు బీట్ రూట్ తింటే అందులో ఎక్కువగా ఉండే కాపర్, ఐరన్ కారణంగా కాలేయ సమస్యలు మరింత పెరుగుతాయి. ఇక షుగర్ అధికంగా ఉన్నవారు కూడా బీట్ రూట్ తినకూడదు.
ఈ అనారోగ్య సమస్య ఉన్నవారిపైనా ప్రతికూల ప్రభావం
మీరు బీట్ రూట్ ఎక్కువగా తింటే నరాలు దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు బీట్ రూట్ తినకుండా ఉంటేనే మంచిది. కిడ్నీలో రాళ్లు ఉన్న వారిపైన బీట్ రూట్ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక మీరు బీట్ రూట్ తినడం మంచిది కాదు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications