పుట్ట గొడుగులు తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!!
పుట్టగొడుగులు.. మన శరీరానికి కావలసిన మంచి పోషకాలు ఉన్న అద్భుతమైన ఆహారం పుట్టగొడుగులు శీతాకాలంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలకు గొప్ప పరిష్కారం చూపిస్తాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడం తోపాటు అనేక వ్యాధుల నుండి మనకు రక్షణ కల్పిస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం మనం పుట్టగొడుగులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.
పుట్టగొడుగులలో ఫుల్ పోషకాలు
పుట్టగొడుగుల్లో మన శరీరానికి కావలసిన అనేక పోషకాలు ఉంటాయి పుట్టగొడుగులను పోషకాల పవర్ హౌస్ అని పిలుస్తారు ఇందులో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, విటమిన్ డి, విటమిన్ బి, సెలీనియం, పొటాషియం అంటే ఖనిజాలు, బీటా గ్లూకాన్స్ తో పాటు మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే అనేక ఇతర సమ్మేళనాలు కూడా ఉంటాయి. కాబట్టి పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల మన శరీరం వ్యాధులు ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది.

గుండె ఆరోగ్యమే కాదు ఈ సమస్యలకు చెక్
పుట్టగొడుగులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను చూసినట్లయితే పుట్టగొడుగుల లో క్యాలరీలు, కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది మన గుండె ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి అంతేకాకుండా మధుమేహం, కీళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి పుట్టగొడుగులు కాపాడతాయి.
బరువుకు, జీర్ణ సమస్యలకు పరిష్కారం
పుట్టగొడుగులను ఆహారంలో భాగంగా తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. పుట్టగొడుగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. క్యాన్సర్ బారి నుండి మనల్ని కాపాడతాయి. పుట్టగొడుగులు హైబీపీని నియంత్రించి మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. పుట్టగొడుగులు మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
జీవక్రియ పెంచే పుట్ట గొడుగులు
పుట్టగొడుగులలో ఉండే రిబోఫ్లావిన్, నియాసిన్, పాంటో థినిక్ యాసిడ్లు మన శరీరంలో జీవక్రియను మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి. మన పేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నుంచి మనలను రక్షిస్తాయి. మన పేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇక చలికాలంలో పుట్టగొడుగులను తినడం వల్ల ఈ సీజన్లో వచ్చే అనేక ఇన్ఫెక్షన్లు కూడా దరిచేరవు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పుట్టగొడుగులను తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications