ఇవి తింటున్నారా? మీ కిడ్నీలు జాగ్రత్త!

మన శరీరంలో ముఖ్యమైన అవయవాలు కిడ్నీలు. అటువంటి కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. కిడ్నీల ఆరోగ్యం పైన ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక కిడ్నీల ఆరోగ్యం కోసం ఏం తినాలి? ఏం తినకూడదు? అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రస్తుతం మనం కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినకూడదు అనే అంశాలను తెలుసుకుందాం.

కిడ్నీల ఆరోగ్యం కోసం ఇవి తినొద్దు
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలని భావించేవారు ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కిడ్నీల ఆరోగ్యం కోసం ప్రాసెస్ చేసిన ఆహారాలను తినకుండా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలలో అధిక స్థాయిలో సోడియం ఉండడం వల్ల అవి తినడం వల్ల అవి మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని తీసుకువస్తాయి. కాబట్టి కిడ్నీల ఆరోగ్యం కోసం ప్రాసెస్ చేసిన మాంసాన్ని, ప్రాసెస్ చేసిన ఆహారాలను తినకుండా ఉండాలని సూచన.

Are you eating these foods Take care of your kidneys

ఇవి తింటున్నారా.. కిడ్నీలకు డేంజర్ జాగ్రత్త
అంతేకాదు కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలని భావించేవారు మయనీస్ కు దూరంగా ఉండాలి. చాలామంది సలాడ్లు, శాండ్విచ్ లలో మయనీస్ ను వాడుతూ ఉంటారు. మయనీస్ అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్య వస్తుంది. చాలామంది బంగాళదుంపలతో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తింటూ ఉంటారు. డీప్ ఫ్రై లు, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ వంటి వాటిని ఎక్కువ తింటారు. ఇవి కిడ్నీల ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి అధికంగా తీసుకోకుండా ఉంటే మంచిది.

ఇవి తాగితే కిడ్నీల ఆరోగ్యం పాడవుతుంది
కొంతమంది సోడాలను ఎక్కువ తాగుతారు సోడా తాగడం ఆరోగ్యానికి ఏ రకంగాను మంచిది కాదు. సోడా లలో చెక్కర ఎక్కువగా ఉంటుంది. ఇవి తాగడం వల్ల మూత్రపిండాలు దెబ్బ తినే పరిస్థితి ఉంది. ఎక్కువగా చూడాలి తాగే వారిలో ఎముకలు బలహీనపడతాయి. ఇది మూత్రపిండాల వ్యాధికి కూడా దోహదం చేస్తుంది. కాబట్టి తాగకుండా ఉంటేనే మంచిది.

ఈ ఆహారాలను తినకండి
ఇక మూత్రపిండాల ఆరోగ్యం కోసం ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తినకూడదు. ఊరగాయలు, రెడీ టు ఈట్ మీల్స్ వంటి వాటిని తినకుండా ఉంటే మంచిది. ఇవి కిడ్నీల పైన ఒత్తిడి పెంచి అనవసరపు అనారోగ్యాలను కలిగిస్తాయి. కనుక కిడ్నీల ఆరోగ్యం కోసం పైన పేర్కొన్న ఆహారాలను తినకుండా జాగ్రత్తలు తీసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+