తోటకూర తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

తోటకూర.. చాలామంది ఆకుకూరలు తినాలంటే ఇష్టపడరు. అందులో తోటకూర తినడం అంటే చాలా విముఖత చూపిస్తారు. ప్రస్తుతం యువత చాలామంది తోటకూర తినాలంటే అసలు ఆసక్తి చూపించటం లేదు. అయితే తోటకూరలో ఉండే పోషకాల గురించి తెలిస్తే, తోటకూర ఎంతో మంచి సూపర్ ఫుడ్ అన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా తోటకూరను ప్రతి ఒక్కరు తినడానికి ఇష్టపడతారు. ఎవరైతే తోటకూరను తినరో..వారు చేతులారా వారి ఆరోగ్యానికి నష్టం చేసుకోవడం అవుతుంది.

తోటకూరలో ఫుల్ పోషకాలు
ఒకప్పుడు తోటకూరను ఎక్కువగా తినే వాళ్ళు కానీ ఇప్పుడు తోటకూర తినడానికి ఇష్టపడడం లేదు. అయితే తోటకూరలో మనకు వచ్చే ఎన్నో రోగాలను రాకుండా చేసే గొప్ప గుణాలు ఉన్నాయి. తోటకూరలో ఉండే ముఖ్యమైన పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దోహదం చేస్తాయి. మన శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే తో పాటు ఫోలేట్ కూడా తోటకూరలో ఉంటుంది.

Are you Eating Thotakura know the health benefits of thotakura

తోటకూరతో రోగాలకు స్వస్తి
తోటకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, బీటా కెరాటిన్, ఫైబర్ వంటి పోషకాలు మనల్ని అనేక రోగాల నుంచి కాపాడతాయి. తోటకూర మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. తోటకూర తింటే మన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి కూడా తోటకూరకు వుంది. తోటకూర గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

తోటకూరతో గుండె జబ్బులకు, బరువుకు చెక్
అధిక రక్తపోటు ఉన్నవారు తోటకూరను తినడం వల్ల బిపిని కంట్రోల్ చేసుకోవచ్చు. గుండె సమస్యలు రాకుండా అడ్డుకోవడంలో తోటకూర ఎంతో బాగా పనిచేస్తుంది. వివిధ రకాల బ్యాక్టీరియాలు, వైరస్ ల నుంచి కాపాడే శక్తి తోటకూరకు వుంది .మన చర్మ సౌందర్యానికి, జుట్టు ఎదుగుదలకు తోటకూర ఎంతో దోహదం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు తోటకూరను తరచూ ఆహారంలో భాగంగా చేసుకుంటే బరువు కూడా ఈజీగా తగ్గుతారు.

తోటకూర ఆహారంలో భాగం చేసుకుంటే మీకే మంచిది
తోటకూర తినడం వల్ల శరీరానికి కావలసిన ఫైబర్ పుష్కలంగా అందుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా తోటకూర అడ్డుకుంటుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు తోటకూరను కచ్చితంగా తినాలి. తోటకూరలో అధికంగా ఉండే కాల్షియం ఎముకలను, దంతాలను గట్టిగా మారుస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తోటకూరను ప్రతి ఒక్కరు ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+