వాడిన నూనెను మళ్ళీ వాడుతున్నారా? అయితే హాస్పిటల్ లో బెడ్ కన్ఫర్మ్!

మనం వంట చేయడానికి రకరకాల నూనెలను ఉపయోగిస్తూ ఉంటాం. అయితే కొన్ని రకాల వంటలు చేసిన తర్వాత మళ్లీ ఆ నూనెను రీసైకిల్ చేసి వాడుతూ ఉంటాం. కానీ అలా రీసైకిల్ చేయడం ఏమాత్రం మంచిది కాదని వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం వల్ల ఆరోగ్యసమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన సమాజంలో దీనిపైన పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల ఇప్పటికి చాలామంది ఇళ్లల్లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారు.

వాడిన నూనె మళ్ళీ వాడితే వచ్చే రోగాలివే
ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేయడం చాలా ప్రమాదకరమని, అది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది అని చెబుతున్నారు వైద్యులు. నూనెను మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల అందులో హానికరమైన రసాయనాలు ఉత్పన్నమవుతాయని, ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని చెబుతున్నారు.

Are you reusing used cooking oil then the hospital bed is confirmed

నూనె పదేపదే వేడి చేస్తే ట్రాన్స్ ఫ్యాట్స్ పెరిగే ప్రమాదం
నూనెని ఎక్కువగా వేడి చేసినప్పుడు అందులో ట్రాన్స్ ఫ్యాట్స్ పెరుగుతాయి. ఇవి ఆరోగ్యానికి హానికరంగా మారుతాయి. అంతేకాదు నూనె వేడి చేయడం వల్ల దాని నాణ్యత క్షీణించి రుచి కూడా మారిపోతుంది. పదేపదే వేడి చేసిన నూనెను వాడడం వల్ల అందులో విషపూరిత పదార్థాలు విడుదలై ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

నూనె మళ్ళీ మళ్ళీ వాడితే విషపూరిత రసాయనాల ఉత్పత్తి
గారెలు, పూరీలు, పకోడీలు ఇతర తినుబండారాలు తయారు చేసినప్పుడు మిగిలిన నూనెను పార పోయకుండా మళ్లీ వినియోగించడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, అందులో ఉత్పన్నమయ్యే హానికరమైన రసాయనాలు శరీరంలో ప్రీ రాడికల్స్ పెరిగి కణాలను దెబ్బతీసేలా చేస్తాయని చెబుతున్నారు. ఇక తరచుగా వినియోగించిన నూనెను పదేపదే వినియోగించడం వల్ల హైపర్ టెన్షన్ వచ్చే సమస్య కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.

వంట నూనెల వినియోగంలో జాగ్రత్త అవసరం
ముఖ్యంగా మాంసాహారాన్ని వేయించిన నూనెలను పదేపదే వాడితే అది మిమ్మల్ని కచ్చితంగా ఆసుపత్రి పాలు చేస్తుంది. హాస్పటల్లో బెడ్ రిజర్వ్ చేసుకునే పరిస్థితికి తీసుకువస్తుంది. కనుక ఆరోగ్యంగా ఉండాలని భావించేవారు వంట నూనెల వినియోగంలో జాగ్రత్త వహించాలి, నూనెను వాడుతున్నప్పుడు ఎంతసేపు వేడి చేశాం, ఎంత మొత్తంలో వాడుతున్నాం అనే విషయాలను తెలుసుకొని తదనుగుణంగా ప్రవర్తించాలి. లేదంటే అనవసరమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+