ఫోన్ బెడ్ మీదే పెట్టుకుని పడుకుంటున్నారా? తీవ్ర హెచ్చరిక!
చాలామంది ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ లేకపోతే ఉండలేని పరిస్థితికి వచ్చారు. నిద్రపోయేటప్పుడు కూడా సెల్ ఫోన్ ను పక్కన పెట్టుకోవడం వారికి అలవాటుగా మారింది. సెల్ ఫోన్ ను పక్కన పెట్టుకొని పడుకోవడం వల్ల, మన ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
పడుకునేటప్పుడు ఫోన్ పక్కనే పెట్టుకుంటే జరిగేదిదే
నిద్రించేటప్పుడు ఫోన్ ను తలకు దగ్గరగా పెట్టుకుని పడుకునే అలవాటు ఉన్నవారు ఆ అలవాటు మార్చుకోవాలని, లేదంటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.మొబైల్ ఫోన్ ను పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టుకొని పడుకోవడం వల్ల రేడియేషన్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. మొబైల్ ఫోన్ వినియోగించక పోయినప్పటికీ కూడా అది రేడియేషన్ ను విడుదల చేస్తుంది.

ఆ పని చేస్తే క్యాన్సర్ ముప్పు
కాలక్రమేణ అది క్యాన్సర్ ముప్పును కూడా పెంచే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అని పేర్కొన్నారు. అయితే ఈ రేడియేషన్ కు మన శరీర కణాలను డిఎన్ఏ ను దెబ్బతీసే శక్తి లేదని చెబుతున్నప్పటికీ ఇటీవల దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ మానవులకు క్యాన్సర్ కలిగించే అవకాశం ఉన్న వర్గంలో దీనిని చేర్చింది.
రేడియేషన్ కారణంగా మెదడు పైన ప్రభావం
ఈ వర్గంలో మనం రోజు తాగే కాఫీ, ఊరగాయలు తదితర వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫోన్ వల్ల వచ్చే ప్రమాదాలు ఒక రేడియేషన్ తో మాత్రమే ఆగడం లేదని పేర్కొన్న వైద్యులు కొన్నిసార్లు ఫోన్లు చార్జింగ్ పెట్టినప్పుడు విపరీతంగా వేడి కావడం కూడా రేడియేషన్ ప్రమాదాన్ని పెంచుతుందని, ఒక్కొక్కసారి ప్రమాదాలకు కారణమవుతుందని చెబుతున్నారు. రేడియేషన్ కారణంగా మెదడు పైన ప్రభావం పడుతుందని ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని చెబుతున్నారు.
మొబైల్స్ వాడే వారు ఈ జాగ్రత్తలు పాటించాలి
కనుక రాత్రి పడుకునే ముందు మొబైల్ ఫోన్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. నిద్రపోవడానికి ముందు ఫోన్లు కాస్త దూరంగా పెట్టుకోవాలని టేబుల్ మీద పెడితే మంచిదని చెబుతున్నారు. అవసరమైతే తప్ప ఫోన్ ను బెడ్రూంలో పెట్టుకోక పోవడమే మంచిదని సూచిస్తున్నారు. అలాగే నిద్రపోవడానికి ముందు ఫోన్ వినియోగాన్ని కూడా బాగా తగ్గించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications