హైబీపీ తగ్గట్లేదా? ఈ హెర్బల్ టీలతో మీ హైబీపీకి చెక్!

ప్రస్తుతం చాలామంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలలో హైబీపీ ఒకటి. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. అయితే హైబీపీని తగ్గించుకోవడానికి అనేక సహజసిద్ధమైన విధానాలు ఉన్నాయి. కొన్ని హెర్బల్ టీలు కూడా హైబీపీ ని కంట్రోల్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం మనం మన ఇంట్లోనే తయారు చేసుకోగలిగిన హై బీపీని కంట్రోల్ చేసే హెర్బల్ టీ ల గురించి తెలుసుకుందాం.

బీపీని కంట్రోల్ చేసే హెర్బల్ టీలు
సోంపు గింజలను నీటిలో మరగబెట్టి తయారు చేసుకునే సోంపుటీ హైబీపీని కంట్రోల్ చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మీ రక్తపోటును కంట్రోల్ చేయడానికి దోహదం చేస్తాయి. అంతే కాదు చామంతి జాతికి చెందిన చమోమిలే టీ తాగితే కూడా మీ హై బీపీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. హైబీపీ ని కంట్రోల్ చేసుకోవడానికి నీళ్లలో అల్లం ముక్కలు వేసి బాగా మరిగించి, దానిని వడకట్టి అల్లం టీ తయారు చేసుకోవచ్చు.

Are you Suffering from high BP Check your high BP with these herbal tea

అల్లం, అర్జున బెరడుతో టీ తాగితే
అల్లం టీని తాగడం ద్వారా కూడా హైబీపీని నియంత్రించవచ్చు. ఇక హై బీపీని తగ్గించుకోవడానికి అర్జున బెరడుతో తయారు చేసిన హెర్బల్ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అర్జున బెరడుతో చేసిన హెర్బల్ టీ తాగడం వలన మీ బీపీ కంట్రోల్ అవుతుంది. అంతేకాదు బీపీ ని కంట్రోల్ చేసుకోవడానికి పుదీనా టీ కూడా బాగా పనిచేస్తుంది.

పుదీనా టీ, దాల్చిన చెక్క టీ
పుదీనా ఆకులను నీళ్లలో వేసి మరిగించి దానిలో తేనె కలిపి పుదీనా టీ గా చేసుకుని తాగితే ఇది మీకు రిఫ్రెషింగ్ గా కూడా ఉంటుంది. పుదీనా టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ రక్తపోటును తగ్గిస్తాయి. దాల్చిన చెక్క టీ తాగడం ద్వారా కూడా మీ బీపీ నీ కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ బీపీని తగ్గిస్తాయి.

తేనే, లెమన్ టీ, తులసి టీ బీపీని తగ్గిస్తాయి
తేనె లెమన్ కలిపి టీ తాయారు చేసుకుని తాగితే కూడా హై బీపీ కంట్రోల్ అవుతుంది. అంతేకాదు తులసిని ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మొక్కగా చెబుతారు. అటువంటి తులసి ఆకులను నీళ్లలో వేసి మరిగించి తీసుకుంటే బీపీ బాగా కంట్రోల్ అవుతుంది. అయితే ఈ హెర్బల్ టీ లను తాగాలి అనుకునేవారు వైద్య నిపుణుల సలహా మేరకు మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి ఏది మంచిది అనేది తెలుసుకొని తాగాలి. అప్పుడే సరైన ఫలితం ఉంటుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+