చలికాలమని బాగా వేడినీళ్ళు స్నానం చేస్తున్నారా?

చలికాలం చలికి తట్టుకోలేక చాలామంది వేడి నీళ్లతో స్నానం చేస్తూ ఉంటారు. ఇక చలికాలంలో వేధించే ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం కోసం కూడా బాగా మసలే నీళ్లను పోసుకొని రిలాక్స్ అవుదాం అనుకొనే వాళ్లు కూడా ఉంటారు. అయితే చలికాలంలో వేడి నీళ్ల స్నానం మరీ ముఖ్యంగా సలసలా కాగే నీళ్లను స్నానం చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చలికాలంలో వేడినీళ్ళ స్నానం చేస్తున్నారా?
గోరువెచ్చని నీళ్లను స్నానం చేస్తే పర్వాలేదు, కానీ చలికాలంలో బాగా వేడిగా ఉన్న నీళ్లను స్నానం చేస్తే అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక చలికాలంలో బాగా వేడి నీళ్లను స్నానం చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటనేది మనం తెలుసుకుందాం.

Are you taking a very hot bath in winter it harms skin and hair

వేడినీళ్ళతో స్నానం చేయటం వలన చర్మ సమస్యలు
చలికాలంలో సహజంగానే చర్మం పొడిగా మారుతుంది. గాలిలో తేమ తక్కువగా ఉండటం వల్ల చలికాలంలో చర్మం పొడి బారి పగిలిపోతుంది. అయితే బాగా వేడినీళ్లతో స్నానం చేస్తే చర్మం మరింత డీహైడ్రేట్ అవుతుంది. దీంతో మరింత చర్మసమస్యలు వచ్చి చర్మం ఇరిటేషన్ కు గురవుతుంది. విపరీతమైన వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే నూనె ఉత్పత్తి తగ్గి చర్మంపైన దురదలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

బాగా వేడినీళ్ళ స్నానం ఈ సమస్యలు ఉన్నవారు చెయ్యొద్దు
చర్మం కళావిహీనంగా తయారవుతుంది. ఎవరికైతే సోరియాసిస్, ఎగ్జిమా, రోసాసియా లాంటి చర్మ సమస్యలు ఉంటాయో వారు మరీ వేడి నీళ్లు స్నానం చేయడం మంచిది కాదు. ఈ సమస్యలు ఉన్నవారు బాగా వేడి నీళ్లను స్నానం చేస్తే ఆ సమస్య మరింత పెరుగుతుంది. విపరీతమైన వేడి నీళ్లను స్నానం చేయడం వల్ల శరీరంలోని సహజసిద్ధమైన నూనెలను కోల్పోయి చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువవుతాయి.

తలస్నానం చెయ్యటం కూడా మంచిది కాదు
చలికాలంతో వేడి నీళ్ల స్నానం చేయడమే కాదు వేడి నీళ్లతో తలస్నానం చేయడం కూడా మంచిది కాదు. సహజంగానే చలికాలంలో జుట్టు ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది. చుండ్రు సమస్య కూడా ఇబ్బంది పెడుతుంది. ఇటువంటి తరుణంలో బాగా ఎక్కువ వేడి నీళ్లను తలస్నానం చేస్తే జుట్టు బలహీనంగా మారి ఊడిపోతుంది.

చలికాలం వేడినీళ్ళ స్నానంతో జాగ్రత్త
జుట్టులో ఉన్న సహజ సిద్ధమైన మెరుపు తగ్గిపోతుంది. జుట్టు పేలవంగా తయారవుతుంది. ముట్టుకుంటే చాలు జుట్టు రాలిపోయే ప్రమాదం కనిపిస్తుంది. కనుక చలికాలం మన చర్మాన్ని మన జుట్టుని దృష్టిలో పెట్టుకొని బాగా వేడి నీళ్ల స్నానం చేయకుండా ఉంటేనే మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+