beauty tips: ఈ పండ్లు తింటే వయస్సు గుర్తించలేనంత యవ్వనంగా.. నిత్య నూతనంగా..
మనలో చాలామంది సంవత్సరం గడుస్తున్న కొద్దీ వయసు మీద పడుతుందని తెగ బాధ పడుతూ ఉంటారు. వయసు కనపడనీయకుండా ఉండటంకోసం యాంటీ ఏజింగ్ క్రీములు, సీరమ్ లు వాడుతూ ఉంటారు. అయితే అవేవీ అవసరం లేకుండానే యాంటీ ఏజింగ్ ఫ్రూట్స్ ఆహారంలో భాగంగా చేసుకుంటే యవ్వనంగా, నిత్యనూతనంగా కనబడతారని, వయసు అసలు గుర్తుపట్టలేనంతగా యంగ్ గా మారతారని చెబుతున్నారు.
వయసు కనబడనివ్వకుండా, అందాన్ని ఇనుమడింపజేసే ఆ పండ్లు ఏమిటో తెలుసుకుందాం. ఆరోగ్యాన్ని మరియు ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడుకోవడానికి ఆహారంతోపాటు జీవనశైలి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. జీవనశైలిలో మార్పులతో పాటు ఆహారంలో కొన్ని యాంటీ ఏజింగ్ ఫ్రూట్స్ ను చేర్చుకుంటే యవ్వనంగా కనిపిస్తారు.

ఇక అటువంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉన్న నారింజ పండు ఒకటి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మ సంరక్షణ చేసి, చర్మం ముడతలు రాకుండా కాపాడతాయి. ఏజింగ్ సమస్యలు లేకుండా చేస్తాయి. వృద్ధాప్యాన్ని మరియు అనేక వ్యాధులను నిరోధించే ప్రీ రాడికల్స్ తో ఇవి పోరాడతాయి.
ఇక మన శరీరంలో కొలాజిన్ ఉత్పత్తిని పెంచి, శరీరాన్ని ముడతలు లేకుండా చేసి, యవ్వనంగా వుంచటంలో పుచ్చకాయలు దోహదం చేస్తాయి. పుచ్చకాయలు శరీరాన్ని హైడ్రేట్ గా కూడా ఉంచుతాయి . ద్రాక్ష పళ్లలో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దోహదం చేస్తాయి.
బొప్పాయి ఆరోగ్యానికే కాదు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది . చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది . చర్మ కణాలు డ్యామేజ్ కాకుండా బొప్పాయి కాపాడుతుంది. బొప్పాయి కూడా ఏజింగ్ లక్షణాలను బయటకు రాకుండా చేస్తుంది. కివీ పండ్లు చర్మాన్ని మృదువుగా మెరుస్తూ ఉండేలా చేస్తాయి.
కివీ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి మరియు విటమిన్ ఈ చర్మ సౌందర్యాన్ని పెంచడానికి పనిచేస్తాయి. అవకాడోలో విటమిన్లు ఆరోగ్యకరమైన కొవ్వుల తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, చర్మం కూడా ఆరోగ్యంగా మారుతుంది. యాంటీఏజింగ్ బెనిఫిట్స్ ఇందులో ఉంటాయి.
disclaimer: ఈ కథనం సౌందర్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications