Beauty tips: చియా సీడ్స్ తో కొరియన్ ఫేస్ ప్యాక్.. గ్లో చూస్తే షాకవుతారు!!
చియా సీడ్స్.. వీటిని ప్రతిరోజు నానబెట్టుకొని తీసుకుంటే ఆరోగ్యం వస్తుందని ప్రతి ఒక్కరికి తెలిసిందే. సబ్జా గింజల మాదిరిగానే ఉండే ఈ సీడ్స్ నిత్యం తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అయితే చియా సీడ్స్ తో అందానికి కూడా మెరుగులు పెట్టొచ్చని చెబుతున్నారు.
ముఖం యొక్క కాంతిని పెంచడానికి చియా సీడ్స్ తో తయారు చేసే కొరియన్ ఫేస్ ప్యాక్ ఎంతో బాగుంటుందని ఈ ఫేస్ ప్యాక్ తో ముఖం కాంతివంతం అవుతుందని, ప్రత్యేకమైన గ్లో సంతరించుకుంటుందని చెబుతున్నారు. కొరియన్ ఫేస్ ప్యాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు కొరియన్ ఫేస్ ప్యాక్ ఏంటి? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఎలా ఉపయోగించాలి? అనే వివరాలు ప్రస్తుతం తెలుసుకుందాం. కొరియన్ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి చియా సీడ్స్ ను ఉపయోగిస్తారు . చియా సీడ్స్ లో ఆరోగ్యానికి చర్మానికి మేలు చేసే అనేక గుణాలు ఉంటాయి. చియా సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు, ఐరన్, ఫాస్ఫరస్, ప్రోటీన్ మరియు క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి.
ఈ విత్తనాలను నీళ్లలో నానబెట్టడం ద్వారా అవి ఉబ్బి జెల్లి మాదిరిగా కనిపిస్తాయి. కొరియన్ మహిళలు ఈ విత్తనాలతో ఫేస్ ప్యాక్ లను చేసుకుంటారు. కొరియన్ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి చియా విత్తనాలు, పాలు అవసరం. నానబెట్టిన చియా విత్తనాలను రెండు స్పూన్లు తీసుకుని సరిపడా పాలలో కలిపి బాగా నానపెట్టండి.
దీనిని బాగా కలపడం వల్ల పాలలో చియా విత్తనాల యొక్క గుణాలు కలుస్తాయి. గంట సేపు దీనిని నానబెట్టాలి. ఇక ఈ పేస్టును ముఖం శుభ్రం చేసుకుని ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి. 20 నుండి 25 నిమిషాల పాటు ఉంచి ఆపై ముఖాన్ని చల్లని నీళ్ళతో కడుక్కోవాలి. ఇక ఈ ఫేస్ ప్యాక్ వల్ల ముఖం కాంతివంతం అయ్యి నిగారింపును సొంతం చేసుకుంటుంది.












Click it and Unblock the Notifications