నిమ్మకాయ గింజలను తినొచ్చా... తింటే ఏమవుతుంది?

నిమ్మకాయ.. విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. నిమ్మకాయలలో విటమిన్ సి తో పాటు ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్ బి12 వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అటువంటి నిమ్మకాయలు మన వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరచడానికి, గుండె జబ్బులు ప్రమాదాలను తగ్గించడానికి దోహదం చేస్తాయి.

నిమ్మ గింజలలో ఫుల్ పోషకాలు
అయితే చాలామంది నిమ్మకాయలను వివిధ రకాలుగా ఆహారంలో భాగంగా చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వారు అందులో ఉండే నిమ్మ గింజలను పడేస్తూ ఉంటారు. కానీ నిమ్మ గింజలలో కూడా మన శరీరానికి ఉపయోగపడే బోలెడన్ని పోషకాలు ఉంటాయని వీటిని పారేయకుండా ఉంటేనే మంచిదని పలువురు చెబుతున్నారు. ఇక నిమ్మ గింజలతో మనకు ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తదితర వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం.

Can we eat lemon seeds What happens if you eat lemon seeds

నిమ్మ గింజలతో ఆరోగ్యం
నిమ్మకాయ లోనే కాదు నిమ్మకాయ గింజలలో కూడా మంచి పోషకాలు ఉంటాయి. నిమ్మకాయ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మకాయ గింజల్లో ఉండే ఫ్లేవనాయిడ్ లు, విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. నిమ్మకాయ గింజల్లో ఉండే ఫైబర్ కారణంగా మన జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

నిమ్మ గింజలతో ఈ ప్రయోజనాలు కూడా
నిమ్మకాయ గింజలు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. మన చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం లోను, కొన్ని రకాల క్యాన్సర్లు ప్రమాదాన్ని తగ్గించడంలోనూ నిమ్మ గింజలు ఎంతగానో దోహదం చేస్తాయి. మూత్రపిండాల్లో రాళ్ళను నివారించడానికి, ఐరన్ శోషణకు నిమ్మకాయ గింజలు దోహదం చేస్తాయి. నిమ్మ గింజలు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఇవి మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి బాగా తగ్గిస్తాయి.

నిమ్మ గింజలను ఇలా తీసుకోకూడదు
అంతేకాదు బరువు తగ్గడానికి కూడా నిమ్మ గింజలు దోహదం చేస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడంలోనూ, నిమ్మ గింజలు కొన్ని రకాల బ్యాక్టీరియాను నివారించడానికి, ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడడానికి ఉపయోగపడతాయి. కాకుంటే నిమ్మ గింజలను అతిగా తీసుకోకూడదు, మితంగా తీసుకుంటే నిమ్మ గింజలు కూడా మంచి ప్రయోజనాలనే ఇస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+