Cervical Cancer: గర్భాశయ క్యాన్సర్ డేంజర్ బెల్స్; ఎందుకు వస్తుంది? లక్షణాలేమిటి?
క్యాన్సర్.. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి. క్యాన్సర్ తో పోరాడుతూ సినీ సెలబ్రిటీల నుంచి రాజకీయ ప్రముఖులు, సామాన్యుల వరకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారినపడి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం దేశంలో క్యాన్సర్ పేషెంట్లు విపరీతంగా పెరుగుతున్నారు. ఇక మహిళలలో ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ మహమ్మారిలా తయారై ప్రాణాలను హరిస్తున్నాయి.
క్యాన్సర్ లో చాలా రకాలు ఉన్నాయి. క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తించగలిగితే ఆ మహమ్మారి నుండి ప్రాణాలు కాపాడుకోవచ్చు. మనం ఈరోజు గర్భాశయ క్యాన్సర్ అంటే ఏంటి? అది ఎందుకు వస్తుంది? ఎలాంటి లక్షణాలతో మనం దానిని గుర్తించవచ్చు అనేది తెలుసుకుందాం. గర్భాశయ కాన్సర్ ఎక్కువగా హ్యూమన్ పాపిలోమా వైరస్ తో సంబంధం కలిగి ఉంటుంది. గర్భాశయ క్యాన్సర్ నే సర్వైకల్ క్యాన్సర్ అని కూడా అంటారు.

గర్భాశయానికి కింది భాగంగా ఉండే సన్నటి ప్రదేశాన్ని సర్విక్స్ అంటారు. ఇది గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది. ఆ ప్రాంతంలో వచ్చే క్యాన్సర్ ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ దీర్ఘకాలిక సంక్రమణ వాస్తవంగా అన్ని గర్భాశయ క్యాన్సర్‌లకు కారణమవుతుంది. రెండు అధిక-ప్రమాద రకాలైన HPV 16 మరియు HPV 18 కారణంగానే ప్రపంచవ్యాప్తంగా 70% గర్భాశయ క్యాన్సర్ లు వచ్చినట్టు తెలుస్తుంది.
లైంగికంగా చురుకుగా ఉండే దాదాపు అందరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో HPV బారిన పడతారు. అయితే అందులో ప్రమాదకరమైన రకాలైన HPV 16 మరియు HPV 18 వైరస్ తరచూ సంక్రమిస్తూ ఉండడం గర్భాశయ క్యాన్సర్ కు కారణంగా మారుతుంది.అయితే మిగతా అన్ని క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తిస్తే పెద్ద ప్రమాదానికి దారి తీసే పరిస్థితి ఉండదు.
మొదటి దశలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే చికిత్స చేయడం తేలిక అవుతుంది. ఇక గర్భాశయ క్యాన్సర్ యొక్క లక్షణాలను చూసినట్లయితే పీరియడ్స్ సమయంలో విపరీతంగా రక్తస్రావం అవుతుంది. నిరంతరం పొత్తికడుపులో నొప్పి రావడం, పీరియడ్స్ మధ్యలో తేలికపాటి రక్తస్రావం కావడం, లేదా బ్లడ్ డ్రాప్స్ కనిపించడం కూడా గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.
శృంగారంలో పాల్గొన్న తర్వాత బ్లీడింగ్ కావడం, సాధారణం కంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ కావడం, నీళ్ల లాగా యోని నుండి స్రావాలు రావడం, దుర్వాసన కలిగించే యోని స్రావాలు, పెల్విక్ పెయిన్, మెనోపాజ్ తర్వాత కూడా ఓవర్ బ్లీడింగ్ ఇవన్నీ గర్భాశయ క్యాన్సర్ లక్షణాలుగా చెబుతున్నారు. ఇక ఇటువంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
రోజుకు ఎంత వంట నూనె వాడాలి, ఏది మంచిది- పరిమితి మించితే..!! -
గ్రీన్ టీ Vs బ్లాక్ టీ: రెండింటి లో ఏది మంచిది, పరిమితి..!! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!!












Click it and Unblock the Notifications