బ్రెయిన్ స్ట్రోక్ పిలుస్తోంది.. ఈ లక్షణాలుంటే తక్షణం డాక్టర్ ను సంప్రదించండి!!
నేడు చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య బ్రెయిన్ స్ట్రోక్. ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా చాలామంది బ్రెయిన్ స్ట్రోక్ కు గురవుతున్నారు. ముందుగా వచ్చే లక్షణాలను గుర్తించలేక బ్రెయిన్ స్ట్రోక్ బాధితులుగా మారుతున్న వారు దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు.
బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది
అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? దానిని అసలు ఎలా గుర్తించవచ్చు? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఏమిటి? వంటి అంశాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో ప్రజలు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. మెదడుకు సరిగ్గా రక్తప్రసరణ జరగకపోయినా, లేదా మెదడులో రక్తం గడ్డ కట్టినా, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా భవిష్యత్తులో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు
బ్రెయిన్ స్ట్రోక్ కు కారణమయ్యే లక్షణాలను గుర్తిస్తే తీవ్రమైన ప్రమాదం బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు .బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరం మొత్తం బలహీనంగా మారుతుంది. మాటలు నత్తిగా వచ్చే అవకాశం ఉంటుంది. శరీరమంతా తిమ్మిర్లు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఏదైనా చెప్పేటప్పుడు కూడా చాలా కన్ఫ్యూజన్ కు గురవుతారు. మెదడుకు ఆలోచించే సామర్థ్యం తగ్గిపోతుంది.
బ్రెయన్ స్ట్రోక్ వచ్చే ముందు ముఖంలో మార్పులు
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు విపరీతమైన తలనొప్పి వస్తుంది. ముఖంలో మార్పు వస్తుంది. చూపు మందగిస్తుంది. ఒక్కోసారి రెండు కళ్ళు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒక వైపుకు ముఖం జారిపోయినట్టుగా మారుతుంది. నిటారుగా నిలబడడంలోను ఇబ్బంది వస్తుంది. శరీరంపై కంట్రోల్ పోతుంది. చేతులు కూడా బలహీనంగా మారుతాయి.
బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలున్నా, వచ్చినా వెంటనే డాక్టర్ ను కలవండి
బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం పొంచి ఉన్న సమయంలో ఒక్కోసారి స్పృహ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదిస్తే బ్రెయిన్ స్ట్రోక్ రాకుండానే కాపాడే అవకాశం ఉంటుంది. ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే త్వరగా రికవరీ అవడానికి అవకాశం ఉంటుంది. ఎంత లేట్చేస్తే అంత ప్రమాదం. కాబట్టి రిస్క్ తీసుకోకండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications