రోజూ ఇవి రెండు నోట్లో వేసుకోండి - షుగర్ కంట్రోల్, లివర్ ఇక సూపర్..!!
లవంగాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. లవంగాలు ఆహారానికి రుచితో పాటు అనేక వ్యాధులను నయం చేయటంలో మేలు చేస్తాయి. రోజూ కేవలం 2 లవంగాలు నమలడం వల్ల అనేక ఆరోగ్య పరమైన లాభాలు ఉన్నాయి. పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, యూజీనాల్ దీనిలో ఉంటాయి. అందుకే వీటిని పోషకాల పవర్‌హౌజ్ అని అంటారు. కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను వదిలించుకోవాలనుకుంటే, లవంగాలను ప్రత్యేక పద్ధతిలో తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. రోజుకి రెండు లవంగాలు తింటే శరీరంలోని అనేక సమస్యలు నయమవుతాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
లవంగాలలో వాపును తగ్గించే గుణాలను అధికంగా కలిగి ఉండటం వల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యల వల్ల వచ్చే వాపును తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. లవంగాల్లో యూజినాల్ ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా సహాయపడుతుందని నిర్దారించారు. రోజువారీ ఆహారంలో భాగంగా వీటిని చేర్చుకోవడం వల్ల మంచి ఆరోగ్య ఫలితాలను పొందవచ్చుని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో సీ విటమిన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, వాపు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం లేదా సాయంత్రం లవంగాలు మరిగించిన నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లవంగాలు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చిగుళ్ల నొప్పి కూడా తగ్గడమే కాకుండా నోటి దుర్వాసనను అడ్డుకుంటుందని చెబుతున్నారు. ఇది నోటిలోని బాక్టీరియాతో పోరాడటానికి కూడా సహాయపడుతుందని వివరిస్తున్నారు.

లవంగాలు జీర్ణక్రియను ప్రోత్సహించే సహజ జీర్ణ లక్షణాలను కలిగి ఉంటాయి. లవంగం రోజు తీసుకోవడం వల్ల వివిధ రకాల జీర్ణ సమస్యలకు చికిత్స చేయడంతో పాటు జీర్ణక్రియను సులభ తరం చేస్తుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. లవంగాలలోని యూజినాల్, ఫ్లేవనాయు డ్లు వంటి సమ్మేళనాలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని డయాబెటిస్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఇవి గ్లూకోజ్ శోషణ తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో దోహదపడుతుందని తెలిపారు. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు లవంగాలను రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. లవంగాలలోని యూజినాల్ కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు, విష పదార్థాలను తొలగించడం ద్వారా కాలేయ పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక, లవంగం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి తోడ్పతుంది. కొలెస్ట్రాల్ స్థాయి ల ను తగ్గించడానికి, ఆరోగ్యకరమైన రక్తప్రసరణకు దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ










Click it and Unblock the Notifications