రెడ్ వైన్ తాగొచ్చా? మంచిదేనా?
మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఇది ప్రతీ లిక్కర్ బాటిల్ మీద ఉంటుంది. అయినా మద్యపానం సేవించే వారు చాలా మందే ఉన్నారు. ఇక వైన్ కూడా మద్యమే అని భావించే వారు ఉన్నారు. వైన్ తాగినా లిక్కర్ తీసుకున్నట్టే అని చెప్పేవారు లేకపోలేదు. ఇక మహిళలు వైన్ తాగొచ్చు అని చెప్తారు. అయితే వైన్ లో కూడా రెడ్ వైన్ మంచిదని అంటారు.
రెడ్ వైన్ తాగొచ్చా?
అసలు రెడ్ వైన్ తాగొచ్చా? రెడ్ వైన్ తాగితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి? లేదా రెడ్ వైన్ తోటి ఏమైనా నష్టం జరుగుతుందా? వంటి అనేక విషయాలు తెలుసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అటువంటి వారి కోసం రెడ్ వైన్ కు సంబంధించిన సమగ్ర సమాచారం ఇప్పుడు మీకోసం.

రెడ్ వైన్ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు
రెడ్ వైన్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే రెడ్ వైన్ తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని దానిని ఎక్కువగా తీసుకోకూడదు. ఒకవేళ అలా తీసుకుంటే నష్టం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు .ఒక పరిమితిలో ప్రతిరోజు రెడ్ వైన్ ను తీసుకోవడం వల్ల అనేక బెనిఫిట్స్ ఉంటాయని అంటున్నారు. క్యాన్సర్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చని చెబుతున్నారు.
ఈ ఆరోగ్య సమస్యలకు రెడ్ వైన్ తో చెక్
ఇది వేసవికాలంలో ఎక్కువగా ఉండే డిప్రెషన్ సమస్య నుండి కూడా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. రెడ్ వైన్ మితంగా తీసుకోవడం వల్ల గుండెజబ్బుల బారి నుండి కాపాడుకోవచ్చని చెబుతున్నారు. జీర్ణశక్తి మెరుగుపడుతుందని, ఎముకల ఆరోగ్యం బాగుంటుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని, నిద్రలేమి సమస్య నుంచి కాపాడుతుందని చెబుతున్నారు. ఇది రక్తపోటును నియంత్రిస్తుందని, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని అంటున్నారు.
రెడ్ వైన్ తో యవ్వనం, అందం
రెడ్ వైన్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయని చెబుతున్నారు. రెడ్ వైన్ చర్మం రంగును ప్రకాశవంతంగా చేస్తుందని, యవ్వనాన్ని పెంచుతుందని కూడా చెబుతున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా గమనించవలసింది రెడ్ వైన్ ను మితంగా తాగాలి. అధికంగా తాగడం ఆరోగ్యానికి హానికరం. కనుక ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని రెడ్ వైన్ తాగాలి అనుకునేవారు మితంగా తీసుకోవడం మంచిది. అలా మితంగా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అందంగా, ఆరోగ్యంగా ఉంటారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications