మటన్ తరచూ తింటే డయాబెటిస్ రిస్క్!

చాలామంది మటన్ ను ఇష్టంగా తింటారు. మటన్ మన శరీరానికి కావలసిన పోషకాలను అందించే మాట వాస్తవమే అయినప్పటికీ అధికంగా మటన్ తినడం మంచిది కాదని వైద్యులు చెప్తున్నారు. ఎక్కువగా మటన్ తినే అలవాటు ఉన్నవారికి అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు మటన్ ఎక్కువగా తినే వారిలో ఎటువంటి అనారోగ్య సమస్యలకు ఆస్కారం ఉందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మటన్ ఎక్కువగా తినేవారిలో ఈ అనర్ధాలు
మటన్ లో శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ బి12 వంటి ఎన్నో పోషకాలు మటన్ లో ఉన్నప్పటికీ, దీనిని అధికంగా తీసుకోవడం మంచిది కాదు.మటన్ ఎక్కువగా తినేవారిలో శరీరంలో కొవ్వు పెరుగుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బులు, కాలేయ జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

Do you know what happens if you eat mutton over eating

Take a Poll

టైప్ 2 డయాబెటిస్ రిస్క్
టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. సహజంగానే మటన్ లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అధిక కొవ్వుతో ఉండే మటన్ మనం తరచూ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగి, గుండెజబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. అంతేకాదు ఎక్కువగా మటన్ తినడం వల్ల విపరీతమైన వేడి చేస్తుంది. తరచూ మటన్ తినే వారిలో ఆలయంపైన ఒత్తిడి పెరిగే కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

మటన్ తినే వారిలో టైప్ 2 డయాబెటిస్ రావడానికి 15% ఎక్కువ అవకాశం
తరచూ మటన్ తింటే మూత్రపిండాలపైన కూడా భారం పడి మూత్రపిండాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో మటన్ తినేవారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే సమస్య ఎక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు తెరిచాయి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన ఒక పరిశోధనలో మటన్ తినే అలవాటు ఉన్నవారిలో టైప్ 2 డయాబెటిస్ రావడానికి 15% ఎక్కువ అవకాశం ఉందని తేల్చారు.

వారంలో రెండు మూడు సార్లు మటన్ తినేవారికి ఈ సమస్య ఎక్కువ
మటన్ లోని హానికారక సాచ్యురేటెడ్ కొవ్వులు మన శరీరంలో సహజ ఇన్సులిన్ విడుదలను అడ్డుకుంటున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వారంలో రెండు మూడు సార్లు మటన్ తినేవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మితంగా మటన్ తింటే పర్వాలేదు కానీ, అధిక మోతాదులో మటన్ తింటే అనవసరపు అనర్ధాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+