ఈ ఐదు రకాల చేపలు అస్సలే తినొద్దు.. డేంజర్!
చాలామంది చేపలలో ఉండే పోషకాలను నేపథ్యంలో చేపలను ఇష్టంగా తింటారు. అయితే చేపలను తినే వాళ్ళు చాలా విషయాలు తెలుసుకోవాలి. ఎక్కువ మొత్తంలో చేపలను తినడం మంచిది కాదని, చేపలతో పాటు కొన్ని ఆహార పదార్థాలను కలిపి తినడం కూడా మంచిది కాదని తెలుసుకోవాలి. అంతేకాదు మరో ముఖ్యమైన విషయం కొన్ని రకాల చేపలను అస్సలు తినకూడదని ఒకవేళ తింటే ప్రాణాల మీదకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
అస్సలే తినకూడని చేపలు
మనం తినకూడని చేపలలో మొదటిది క్యాట్ ఫిష్ . ఈ క్యాట్ ఫిష్ కోళ్ల వ్యర్ధాలు కుళ్ళిపోయిన వాటిని తిని బ్రతుకుతాయి. క్యాట్ ఫిష్ తింటే మన శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. క్యాట్ ఫిష్ తిన్నవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది..క్యాట్ ఫిష్ లో ఒమేగా సిక్స్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి మన నరాల వ్యవస్థను దెబ్బతీస్తాయి. కనుక క్యాట్ ఫిష్ ను తినకుండా ఉండటమే మంచిది.

ఈ చేపలు తింటే ఆరోగ్య సమస్యలు
మనం తినకూడని చేపలలో మరొకటి తిలాపియా చేప. ఈ చేపను పేదవాడి చేపగా చెబుతారు. అయితే తిలాపియా చేపలానే కనిపించే మరొక చేప నైల్ తెలాపియా చేప. ఇక ఈ చేపను తింటే ఆరోగ్య సమస్యలకు వెల్కమ్ చెప్పినట్టే. ఈ చేపలు తింటే గుండె జబ్బులు, ఆస్తమా వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ చేపలను తినకూడదని చెబుతున్నారు.
ఈ చేపలు తింటే కండరాలు బలహీనం
ఇక మనం తినకూడని మరొక చేప ఆరెంజ్ రోఫీ చేప. ఈ చేపలో ఎక్కువ మొత్తంలో మెర్క్యూరీ ఉంటుంది. ఇది దాదాపు 100 సంవత్సరాలు కంటే ఎక్కువ కాలం జీవిస్తుంది. ఈ చేపలను గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు తింటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి కండరాలు బలహీనంగా మారుతాయి. డిప్రెషన్ వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు. అలాగే మెమరీ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.
టైల్ ఫిష్ తో ఆరోగ్యం డేంజర్ లో
ఇక మనం తినకూడని మరొక చేప టైల్ ఫిష్. టైల్ ఫిష్ వల్ల కూడా మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దీనిలోనూ మెర్క్యూరీ అధిక స్థాయిలో ఉంటుంది. ఈ చేప ఎక్కువగా విష రసాయనాలకు గురవుతుంటుంది . ఈ చేపలను తింటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గర్భిణీ మహిళలు, పాలిచ్చే స్త్రీలు ఈ చేపలను అస్సలు తినకూడదు.
ఈల్ ఫిష్ తింటే ప్రమాదం
ఇక మనం తినకూడని మరొక చేప ఈల్ ఫిష్. ఎల్ ఫిష్ తినడానికి రుచికరంగా ఉన్నప్పటికీ ఈ చేప తినడం మాత్రం డేంజర్. దీని రక్తం కూడా విషపూరితమైంది. ఇది మన ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది టాక్సిన్స్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దీనిని తిన్నవారికి నరాల సంబంధిత సమస్యలు, కండరాల సంబంధిత సమస్యలు వస్తాయి. కనుక ఈ చేపలను తినకుండా ఉండటమే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications