ఈ ఆహారాలను వేడి చేసి తినొద్దు... డేంజర్!

చాలామంది ఆహారాలను వేడి చేసుకుని మరీ తింటూ ఉంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలను వేడి చేసి తినడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందని, అనవసరమైన అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. కొన్ని రకాల ఆహారాలను అస్సలు వేడి చేయకూడదని హెచ్చరిస్తున్నారు. మరి ఆహారాలు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వీటిని వేడి చేసి తాగకండి
చాలామంది కాఫీ, టీ లను పదే పదే వేడి చేసి తాగుతూ ఉంటారు కాఫీని పదేపదే వేడి చేసే తాగడం వల్ల దాని రుచి మారిపోయి ఎసిడిటీ గుణం పెరుగుతుంది. ఇది కడుపులో సమస్యకు కారణం అవుతుంది. టీని పదే పదే వేడి చేసే తాగడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నాశనం అయిపోయి టానిన్స్ విడుదలవుతాయి. ఇది జీర్ణ క్రియను మందగించేలా చేస్తుంది. మన జీర్ణ వ్యవస్థకు హాని కలిగిస్తుంది.

Do not heat and eat these foods Danger

ఇవి వేడి చేసి తినకండి
ఇక చాలామంది ఫ్రై చేసిన ఆహారాన్ని మళ్లీమళ్లీ వేడి చేసి తింటూ ఉంటారు. ఒకసారి ఆయిల్ లో ఫ్రై చేసిన ఆహారాన్ని మళ్లీ వేడిచేసి తినడం వల్ల ప్రమాదకరమైన రసాయనాలు వెలువడి అవి మన ఆరోగ్యానికి హానిచేస్తాయి. కొందరు అన్నాన్ని వేడి చేసి తింటూ ఉంటారు. అన్నాన్ని వేడి చేయడం వల్ల అందులో ప్రమాదకరమైన బ్యాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా అలాగే ఉండిపోతుంది. ఇది మన ఆరోగ్యానికి హాని చేస్తుంది.

చేపలు, పాలతో చేసినవి వేడి చేసి తింటున్నారా?
పాలతో చేసిన ఆహారాలైన సూప్ లు, కూరలు వేడి చేసి తింటూ ఉంటారు. ఇలా వేడి చేసి తినడం వల్ల వాటి రుచి మారిపోతుంది. ఇది మన జీర్ణ సమస్యకు కారణం అవుతుంది. కొంతమంది చేపలను వండుకున్న తర్వాత మళ్లీ వేడి చేసి తింటూ ఉంటారు. దీని వల్ల అందులో ఉండే ప్రోటీన్స్ తగ్గిపోయి ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక చేపల కూరను అస్సలు వేడి చేయకూడదు.

ఆకుకూరలు వేడి చేసి తింటే జరిగేదిదే
ఇక ఆకుకూరలను వేడి చేసి తినడం వల్ల కూడా అనారోగ్యమే కలుగుతుంది. వీటిలో ఉండే నైట్రేట్స్ నైట్రైట్స్ గా మారి ప్రమాదకరంగా తయారై మనకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ఇక ఉడికిన బంగాళదుంపలను కూడా మళ్లీ వేడి చేసి తినకూడదు. ఇందులో క్లోస్ట్రిడియం బొటాలినమ్ లాంటి బ్యాక్టీరియా ఉండడం వల్ల ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుంది.

గుడ్లు వేడి చేసి తింటే మంచిదా.. కాదా?
గుడ్లు వేడి చేసి తినడం కూడా మంచిది కాదు.గుడ్లను వేడి చేస్తే అందులో ఉండే ప్రోటీన్ పోతుంది ఇది మన అరుగుదల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక పైన పేర్కొన్న ఆహారాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తినడం మంచిది కాదనే విషయాన్ని గుర్తించి జాగ్రత్తగా ఉండండి. ఎప్పటి ఆహారాన్ని అప్పుడే వండుకుని తింటే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటామని విషయాన్ని గుర్తుంచుకోండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+