ఈసీజీ చూసి గుండె ఆరోగ్యంగా ఉందని నమ్ముతున్నారా? అలెర్ట్!
మీ గుండె ఆరోగ్యంగా ఉందా? మీ గుండె ఆరోగ్యంపై ఈసీజీ తీసుకుని గుండె ఆరోగ్యంగా ఉందని భ్రమ పడుతున్నారా? గుండె ఆరోగ్యం కోసం తీసే ఈసీజీ దాని స్థితిని కచ్చితంగా చెబుతుంది అని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే.
ఈసీజీతో గుండె ఆరోగ్యం తెలుస్తుందా?
కేవలం ఈసీజీ తీయించుకుంటే గుండె ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా చెప్పలేము. అందుకే గుండె ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈసీజీ మీదనే డిపెండ్ కాకూడదని వైద్యులు చెబుతున్నారు. ఈసీజీ తో పాటు మరో రెండు పరీక్షలు చేయించుకుంటేనే గుండె ఆరోగ్యం పైన పూర్తి అవగాహన వస్తుందని చెబుతున్నారు. ఈసీజీ లో ఫలితాలు సాధారణంగా ఉన్నప్పటికీ గుండె అసలు స్థితిని అది పూర్తి స్థాయిలో చూపించదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గుండె పరిస్థితిని తెలుసుకోవాలంటే ఈ టెస్ట్ లు ముఖ్యం
గుండె ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి మనం తీసుకునే ఈసీజీ కేవలం 20 నుంచి 30% మాత్రమే మన గుండె ఆరోగ్యానికి తెలియజేస్తుందని, పూర్తి స్థాయిలో అది మన గుండె ఆరోగ్యం గురించి, గుండె పరిస్థితిని కచ్చితంగా తెలుసుకోవాలంటే టిఎంటి, ఎకో కార్డియోగ్రఫీ వంటి ముఖ్యమైన పరీక్షలు ఉన్నాయని, అవి చేయించుకుంటే గుండె ఆరోగ్య పరిస్థితి తెలుస్తుందని అంటున్నారు.
ఈసీజీలో ఏమైనా మార్పులు కనిపించినా అది ప్రమాద సంకేతం
టిఎంటి అంటే ట్రెడ్మిల్ టెస్ట్, ట్రెడ్మిల్ మీద రోగి నడుస్తున్నప్పుడు, లేదా పరిగెడుతున్న దాని వేగం వాళ్ళు పెంచుతూ ఉంటే గుండె పనితీరు ఏ విధంగా ఉంది అనేది అంచనా వేస్తూ ఈసీజీ రికార్డ్ చేస్తారు. ఈ పరీక్షలో చాతినొప్పి వచ్చినా, ఈసీజీలో ఏమైనా మార్పులు కనిపించినా అది ప్రమాద సంకేతం అని వైద్యులు చెబుతున్నారు.
ఎకో కార్డియోగ్రఫీ అల్ట్రాసౌండ్
ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి మరొక ముఖ్యమైన పరీక్ష ఎకో కార్డియోగ్రఫీ, ఎకో కార్డియోగ్రామ్. ఇది ఒక రకమైన అల్ట్రాసౌండ్ ద్వారా చేసే పరీక్ష. దీని ద్వారా గుండె కదలికలు ఈజీగా తెలుస్తాయి. ఈ పరీక్షలో గుండె యొక్క లోపలి భాగాలను, అది పనిచేసే విధానాన్ని రియల్ టైం లో చూడడం జరుగుతుంది. ఇది మన గుండె యొక్క పనితీరును కొలిచి చెబుతుంది.
ఈసీజీని నమ్ముకుని గుండె ఆరోగ్యంపై భ్రమ పడొద్దు
గుండె వాల్వ్ ల పరిస్థితి గదుల పరిమాణం వాటి మధ్య ఏమైనా సంబంధం ఉందా అంటే అనేక విషయాలను తెలియజేస్తుంది. ఇక ఈ పరీక్ష ద్వారా మన గుండె ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు. ఒక్క ఈసీజీని నమ్ముకొని గుండె ఆరోగ్యంగా ఉందని భ్రమ పడవద్దు అని వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications