చికెన్ రోజూ తింటున్నారా? షాకింగ్ అధ్యయనంలో సంచలన విషయాలు!

చాలామంది చికెన్ తింటారు. చికెన్ ఇష్టంగా తినేవాళ్లు దానిని పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వారంలో సగానికి ఎక్కువ రోజులు చికెన్ తిని తమ శరీరానికి కావలసిన ప్రోటీన్ అందుతుందని అనుకుంటూ ఉంటారు. అయితే తరచూ చికెన్ తినడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్స్ మాట అటుంచి కొత్త అనారోగ్య సమస్యలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి.

చికెన్ పై తాజా అధ్యయనం
నాన్ వెజ్ ఇష్టంగా తినేవాళ్లు ఎక్కువ మంది చికెన్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. రకరకాలుగా వండుకొని తింటూ ఉంటారు. చికెన్ బిర్యాని, చికెన్ ఫ్రై, చికెన్ లాలీపాప్, చికెన్ పకోడీ ఇలా ఒకటి కాదు రెండు కాదు చికెన్ తో అనేకరకాల వంటకాలను తయారుచేసి లాగిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఒక అధ్యయనం చికెన్ ఎక్కువగా తినడం , ప్రతిరోజు తినడం మంచిది కాదనే విషయాన్ని స్పష్టం చేసింది.

Do you eat chicken everyday Sensational things in a shocking study

చికెన్ రోజూ తినేవారికి అనారోగ్యం
ఓహీయో స్టేట్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ హెల్త్ అండ్ రిహాబినిటేషన్ సైన్సెస్ మెడికల్ డైటెటిక్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ టేలర్ చికెన్ తరచూ తింటే ఏమవుతుంది అనే అంశంపై 35000 మంది అమెరికన్ల పైన అధ్యయనం నిర్వహించినట్టు చికెన్ ప్రతిరోజు తినేవారికన్నా అప్పుడప్పుడు చికెన్ తినేవారు ఆరోగ్యంగా ఉన్నట్టు గుర్తించామని తెలిపారు.

చికెన్ అధిక వినియోగంతో సమస్యలు ఇలా
వారానికి ఒకటి రెండుసార్లు 100 గ్రాములకు మించకుండా చికెన్ ని తింటే ఎటువంటి అనారోగ్యం దరిచేరదని చెబుతున్నారు. ఈ అధ్యయనంలో చికెన్ అత్యధిక వినియోగం వల్ల వారు మధుమేహం బారిన పడ్డట్టు పేర్కొన్నారు. అంతేకాదు రక్తనాళాలలో ట్రై గ్లిజరైడ్స్ పేరుకుపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు తేలిందని వెల్లడించారు.

చికెన్ తో ఇవి తిన్నా డేంజర్
కొంతమంది చికెన్ తో పాటు కచప్ పెట్టుకొని తింటూ ఉంటారు. అటువంటివారు దానికి దూరంగా ఉండాలని చికెన్ మాత్రమే కాదు కచప్ వినియోగం కూడా మంచిది కాదని చెబుతున్నారు. ఐస్ క్రీమ్స్, పిజ్జాలు, చీజ్ ఇటువంటివి ఏ విధంగా అయితే అనారోగ్యకరమో అదేవిధంగా కచప్ కూడా అనారోగ్యకరమని వెల్లడించారు. చికెన్ మనకు కావలసిన ప్రోటీన్ ను అందిస్తుంది. మన శరీరానికి కావలసిన వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

చికెన్ వీళ్ళు అసలే తినొద్దు
కానీ తాజాగా జరిపిన కొత్త అధ్యయనం ప్రకారం చికెన్ అధికంగా తింటే మాత్రం అనర్ధాలు తప్పవు. చికెన్ తరచూ తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. బరువు బాగా పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తరచూ చికెన్ తినకూడదు. గౌట్ నొప్పితో బాధపడే వారు కూడా చికెన్ తినడం వల్ల ఆ నొప్పి మరింత పెరుగుతుంది. చికెన్ తినడం మంచిదే అయినప్పటికీ తరచూ తినడం మాత్రం అనారోగ్యానికి కారణం అవుతుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+