బెండకాయలను తక్కువ అంచనా వెయ్యొద్దు... వాటి ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!!
ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్యం కోసం మనం మన ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. మనం నిత్యం తీసుకునే కూరగాయలలో బెండకాయలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. బెండకాయలలో మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బెండకాయలలో విటమిన్ సి, మెగ్నీషియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి.
బెండకాయలతో ఫుల్ ఆరోగ్యం
బెండకాయలను తరచూ తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. ఫైబర్ మన పేగులను శుభ్రం చేసి మన కడుపుకి సంబంధించిన జబ్బులు రాకుండా కాపాడుతుంది. బెండకాయలలో ప్రోటీన్ అంత ఎక్కువగా ఉండదు. కానీ ఇందులో ఉండే ప్రోటీన్ మన శరీరానికి ఉపయోగపడుతుంది. బెండకాయలో ఫైబర్ ఉంటుంది. ఇది నీళ్లలో కరిగిపోతుంది. దీని కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మన బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.

బెండకాయలు తింటే కలిగే ప్రయోజనాలివే
ఆస్తమాతో బాధపడుతున్న వాళ్ళు బెండకాయలను తింటే మంచి జరుగుతుంది. వారికి ఆస్తమా నుంచి ఉపశమనం కలుగుతుంది. బెండకాయలో ఉండే విటమిన్ ఏ కారణంగా కళ్ల సమస్యలు దూరం అవుతాయి. బెండకాయలో ఉండే అధిక ఫైబర్ మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి మలబద్దకం నివారించడానికి ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బీపీని నియంత్రించడానికి బెండకాయ పనిచేస్తుంది.
బెండకాయలతో ఎముకల దృఢత్వం
బెండకాయలో ఉండే విటమిన్ సి, క్యాల్షియం మరియు మెగ్నీషియం ఎముకల దృఢత్వానికి దోహదం చేస్తాయి. మనకు ఎటువంటి రోగాలు రాకుండా ఇమ్యూనిటీని పెంచడానికి కూడా బెండకాయలు పనిచేస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా బెండకాయలలో ఉండే కొలాజిన్, యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు ఆరోగ్యంగా యవ్వనంగా ఉండేలా చేస్తాయి.
బెండకాయలతో ఆరోగ్యంతో పాటు అందం
మన జుట్టు పెరుగుదలకు, చర్మ సంరక్షణకు బెండకాయలు ఎంతగానో ఉపయోగపడతాయి. బెండకాయలను తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది . డయాబెటిస్ ఉన్నవారు కూడా బెండకాయలను తింటే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. ఎన్నో అద్భుతమైన గుణాలున్న బెండకాయలను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి, అందానికి మేలు జరుగుతుంది .అందుకే బెండకాయలను తక్కువ అంచనా వేయకుండా వాటి ప్రయోజనాలను తెలుసుకొని ఆహారంలో భాగంగా చేసుకోండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications