ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలో వండిన అన్నం తింటే ఏమవుతుందంటే!!

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు బిజీగా ఉండడం కారణంగా వంట చేసుకోవాలంటే, కాసేపు స్టవ్ దగ్గర నిలబడాలంటే కుదరని పరిస్థితి ఉంది. అయితే మారుతున్న టెక్నాలజీతో పాటు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు కూడా అందుబాటులోకి రావడంతో ప్రతి ఇంట్లోనూ అన్నం వండాలంటే రైస్ కుక్కర్లను ఉపయోగిస్తున్నారు.

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలో అన్నం
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలో బియ్యం పెట్టి కుక్కర్ ఆన్ చేస్తే అన్నం ఉడికిన తర్వాత దానంతట అదే ఆఫ్ అయిపోతుంది. ఇందులో మధ్యలో వెళ్లి అన్నాన్ని చూడాల్సిన అవసరం కానీ, పొయ్యి దగ్గరే ఉండాల్సిన అవసరం కానీ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లోనే అన్నం వండేందుకు మొగ్గు చూపుతున్నారు.

Easy to cooking rice in electric rice cookers but risk to health

క్యాన్సర్ ముప్పు
అయితే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం తింటే అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అల్యూమినియం పాత్రలను ఉపయోగిస్తారు. ఒక్కొక్కసారి ఈ పాత్రల కారణంగా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

లెక్కకు మిక్కిలి రోగాలు
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నాన్ని తింటే చిన్న వయసులోనే కీళ్లనొప్పుల బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు.
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలో వండిన అన్నాన్ని తినడం వల్ల గ్యాస్ సమస్యలు, ఉదర సంబంధమైన సమస్యలు, అధికబరువు, నడుము నొప్పి, కీళ్లవాతం, డయాబెటిస్, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి నాశిరకం రైస్ కుక్కర్లను ఉపయోగించడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం కూడా ఉందని సూచిస్తున్నారు.

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లతో డేంజర్
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం తింటే శరీరానికి ఎటువంటి పోషకాలు లభించవని, నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్ లను అస్సలు వాడకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పని ఈజీగా అయిపోతుందని రైస్ కుక్కర్లో అన్నం వండుకుని తింటే దానివల్ల ఎలాంటి లాభం జరగదని, అనేక నష్టాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నాన్ని వండుకు తినడం మానుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+